ప్రదీప్ ఫాస్పేట్ లిమిటెడ్ తమ తొలి పబ్లిక్ ఆఫరింగ్‌ను మే 17న ప్రారంభించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లు తమ బిడ్‌ను ఆఫర్ పీరియడ్‌కు ఒక్కరోజు ముందు అంటే మే 16న తమ బిడ్ దాఖలు చేయవచ్చు. పది రూపాయల ఫేస్ వ్యాల్యూతో కలిగిన ఈక్విటీ షేర్ ప్రైస్ బ్యాండ్‌ను రూ.39 నుండి రూ.42 మధ్య స్థీకరించింది. కనీసం 350 ఈక్విటీ షేర్లను తమ బిడ్‌లను దాఖలు చేసుకోవచ్చు. ఈ ఇష్యూలో భాగంగా 10,040 మిలియన్ రూపాయల విలువ కలిగిన షేర్లను తాజాగా జారీ చేసుకోనుండగా.. 11,85,07,493 ఈక్విటీ షేర్లను విక్రయాలకు ఉంచనున్నారు. ఈ ఆఫర్ ద్వారా లభించిన మొత్తాలను అప్పులు తీర్చడంతో పాటు కార్పొరేట్ కార్యకలాపాల కోసం ఉపయోగించేందుకు నిర్ణయించినట్టు కంపెనీ వివరించింది. ఈ ఆఫర్‌లో భాగంగా విక్రయించే ఈక్విటీ షేర్లలో 60,18,493 షేర్లను జూరీ మారోక్ ఫాస్సేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ రాష్ట్రపతికి చెందిన 11,24,89,000 ఈక్విటీ షేర్లను మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ద్వారా విక్రయించనున్నారు.
ప్రదీప్ ఫాస్పేట్ ఐపీఓ, మే 17 సబ్ స్క్రిప్షన్ ప్రారంభం
Advertisement
తాజా వార్తలు
Advertisement