హైదరాబాద్ : భారతదేశపు మొట్టమొదటి, అనుభవపూర్వకమైన శిక్షణ యాప్ ప్రాక్టికల్లి.. తన వేసవి వర్క్‌షాప్ రెండో వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 25న ప్రారంభమై.. నాలుగు నుంచి ఆరు వారాల వరకు కొనసాగుతుంది. కొత్త యూజర్స్ ప్రాక్టికల్లి లైవ్ ఆన్‌లైన్ తరగతులకు సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. దీని కోసం నెలకు కేవలం రూ.225 చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా నమోదు చేసుకున్నవారికి.. ప్రాక్ట్ సమ్మర్ 30 వోచర్ కోడ్‌ను ఉపయోగించి.. వార్షిక సబ్ స్క్రిప్షన్‌లో 30శాతం వరకు తగ్గింపును పొందొచ్చు. సమ్మర్ క్లాసుల విషయంలో ప్రాక్టికల్లి ఓ సర్వే నిర్వహించింది.
గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సును 56శాతం, గేమ్ డెవలప్‌మెంట్ కోర్సును 53శాతం మంది కోరుకున్నారు. ఫొటోగ్రఫీ, సంగీతంను 50శాతం మంది, రొబోటిక్స్‌ను 44 శాతం మంది, వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌ను 43 శాతం మంది కోరుకున్నారు. 6 కోర్సులతో వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఆసక్తిని బట్టి విద్యార్థులు వివిధ కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..