Saturday, November 23, 2024

Coal India | రూ.21,547 కోట్లతో విద్యుత్‌ ప్రాజెక్ట్‌లు.. ఆమోదించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌) రెండు థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకు 21,547 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. ఈ రెండు ప్లాంట్ల నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం నాడు జరిగిన ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ సమావేశంలో ఆమోదించింది. ఈ రెండు విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణంలో కోల్‌ ఇండియా అనుబంధ సంస్థలుగా ఉన్న సౌత్‌ ఈస్ట్రన్‌ కోల్‌ ఫిల్డ్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఈసీఎల్‌), మహానది కోల్‌ఫిల్డ్‌ ్స లిమిటెడ్‌ (ఎంసీఎల్‌) కూడా భాగస్వామ్యం కానున్నాయి. ఈ మూడు సంస్థల ఈక్విటీ పెట్టుడిని ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఆమోదించింది.

సౌత్‌ ఈస్ట్రన్‌ కోలోఫిల్డ్స్‌ లిమిటెడ్‌ 660 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని మహారాష్ట్ర ప్రభుత్వ పవర్‌ జనరేటింగ్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎంపీపీజీసీఎల్‌)తో సంయుక్త భాగస్వామ్యం (జేవీ)గా ఏర్పాటు చేయనుంది. మహానది కోల్‌ఫీల్డ్స్‌ సంస్థ తన అనుబంధ సంస్థ మహానది బేసిన్‌ పవర్‌ లిమిటెడ్‌ (ఎంబీపీఎల్‌)తో కలిసి 800 మెగావాట్ల సామర్ధ్యంతో రెండు యూనిట్లను ఏర్పాటు చేయనుంది. 660 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌లో 823 కోట్ల ఈక్విటీ పెట్టుబడిని ఎస్‌సీఈఎల్‌ పెట్టనుంది. మొత్తం ప్రాజెక్ట్‌ పెట్టుబడి 5,600 కోట్లు. ఈ జేవీలో 70:30 రేషియోలో పెట్టుబడులు పెట్టనున్నాయి. 800 ఇంటూ 2 ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు 15,947 కోట్ల పెట్టుబడి పెెట్టనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement