ఈ సంవత్సరం మన దేశం షుగర్ ఎగుమతులపై నిషేధం విధించే అవకాశం ఉంది. దేశంలో చెరకు సీజన్ అక్టబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ సారి సరైన వ ర్షాలు పడకపోవడంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీజన్ ప్రారంభానికి ముందే షుగర్ ఎగుమతులపై నిషేధం విధించాలని భావిస్తున్నట్లు దీనికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇదే జరిగితే మన దేశం ఏడు సంవత్సరాల తరువాత షుగర్ ఎగుమతులు విధించినట్లు అవుతుంది.
మన దేశం లేకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో షుగర్ ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే న్యూయార్క్, లండన్ ట్రేడింగ్‌లో బెంచ్‌మార్క్ ప్రైస్ పెరిగింది. మన దేశం నిషేధం విధిస్తే ఈ ధరలు మరింత పెరిగుతాయని, దీని వల్ల ఆహార ద్రవ్యోల్బణం పరుగుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడమే ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని, దీని తరువాత మిగులు చెరకును ఇంథనాల్ ఉత్పత్తికి వినియోగించాలని భావిస్తున్నట్లు ఆ అధికారి వెల్లడించారు.
అందువల్ల ఈ సీజన్‌లో ఎగుమతి చేసేందుకు తగినంత షుగర్ అందుబాటులో ఉండదని ఆ అధికారి తెలిపారు. షుగర్ మిల్స్ సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే సీజన్‌లో 6.1 మిలియన్ టన్నుల షుగర్‌ను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దేశీయంగా 11.1 మిలియన్ టన్నుల షుగర్‌ను దేశీయ మార్కెట్‌లో విక్రయించాల్సి ఉంటుంది. దీని తరువాతే ఎగుమతులు చేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది.
ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధిస్తే ఎగుమతులు ఉండకపోవచ్చు. గతంలో 2016లో ప్రభుత్వం షుగర్ ఎగుమతులు తగ్గించేందుకు 20 శాతం పన్ను విధించింది. ప్రస్తుతం దేశంలో షుగర్ ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం ఆగస్టులో అదనంగా 2 లక్షల టన్నుల షుగర్‌ను ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వడంతో దేశీయ మార్కెట్‌లో ధరలు పెరిగాయి. ఈ సారి 2023-24 సంవత్సరంలో దేశంలో షుగర్ ఉత్పత్తి 3.3 శాతం తగ్గి 31.7 మిలియన్ టన్నులుగా ఉంటుందని అంచనా.