హైదరాబాద్ : హైదరాబాద్ స్టేడియంలో8వ ఎడిషన్ పీఎన్‌బీ మెట్‌లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (జేబీసీ) గ్రాండ్ ఫినాలేకు చేరుకుని, దేశంలోని యువ బ్యాడ్మింటన్ ప్రతిభావంతులు సాధించిన విజయాలను వేడుక చేసుకుంటోంది. వరుసగా మూడవ ఏడాది బహుళ నగరాలలో అత్యధిక చిన్నారులు పాల్గొనే బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ గా ఈ ఈవెంట్ చారిత్రక మైలురాయిగా నిలిచిపోనుంది. ముగింపు సంరంభానికి ఏషియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత, జేబీసీ మెంటార్‌లు అయిన చిరాగ్ షెట్టి, సాత్విక్ రాంకిరెడ్డిలతో పాటుగా, చిరాగ్ శెట్టి అండ్ సాత్విక్ రాంకిరెడ్డి, ముఖ్య అతిథి వెంకట్ చంగవల్లి, సీఈఓ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా, సమీర్ బన్సల్, సీఈఓ అండ్ ఎం.డి, పీఎన్‌బీ మెట్‌లైఫ్ అండ్ సౌరభ్ లోహ్టియా, సి ఎం సి ఓ , పీఎన్‌బీ మెట్‌లైఫ్ లు ప్రాతినిధ్యం వహించారు.
విజేతలుగా నిలిచిన యువ అథ్లెట్‌లకు, వారి అసామాన్యమైన విజయానికి గుర్తుగా ప్రతిష్టాత్మక జేబీసీ ట్రోఫీని అందజేశారు. టోర్నమెంట్ విజయం సాధించడం పట్ల పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఎండీ అండ్ సీఈఓ అయిన మి. సమీర్ బన్సల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పీఎన్‌బీ మెట్‌లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మరో విజయవంతమైన ఎడిషన్‌ను పూర్తి చేసుకోనుండడంతో, వరుసగా మూడవ ఏడాది సాధించిన ప్రపంచ రికార్డును మాత్రమే కాకుండా, దేశం నలుమూలల నుండి అద్భుతమైన ప్రతిభ ఉద్భవించడాన్ని కూడా తాము వేడుక చేసుకుంటున్నామన్నారు.
ఏషియన్ గేమ్స్ బంగారు పతక విజేత, జేబీసీ 2024 మెంటార్ అయిన సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి మాట్లాడుతూ… ఈ ఏడాది జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న యువకుల అద్భుతమైన ప్రతిభ, ఉత్సాహాన్ని చూడటం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. సాత్విక్‌సాయిరాజ్‌కు డబుల్స్ పార్ట్‌నర్ అండ్ జేబీసీ 2024కు తోటి మెంటార్ అయిన చిరాగ్ షెట్టి మాట్లాడుతూ…. పీఎన్‌బీ మెట్‌లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 8వ ఎడిషన్‌లో యువ ఆటగాళ్లు ప్రదర్శించిన శక్తి, నైపుణ్యాల గురించి చెప్పేందుకు అద్భుతం అనడం కంటే తక్కువ కాదన్నారు. ఈ ఈవెంట్ ఔత్సాహిక బ్యాడ్మింటన్ స్టార్‌లను వెలుగులోకి తీసుకొచ్చే దీపస్తంభంగా అవతరించిందన్నారు.