Tuesday, November 19, 2024

సుల‌బ‌త‌ర‌మైన కంట్రిబ్యూష‌న్ల కోసం ఫోన్‌పే & భారత్ కనెక్ట్ భాగస్వామ్యం

NPS (జాతీయ పెన్షన్ సిస్టం)కు కంట్రిబ్యూషన్లను తన వేదికపైన భారత్ కనెక్ట్ (గతంలో BBPS) కింద కొత్త సేవింగ్స్ విభాగంగా ఆవిష్కరించామని ఫోన్‌పే నేడు ప్రకటించింది. ఈ ఆవిష్కరణ ద్వారా లక్షలాదిమంది యూజర్లకు ఫోన్‌పే ఇప్పుడు నిరంతరాయమైన, సురక్షితమైన, సులభమైన రీతిలో కంట్రిబ్యూషన్లను ఫోన్‌పే యాప్ ద్వారా వారి NPS అకౌంట్ కు చేసే వీలు కల్పించింది.

ఈ ఆవిష్కరణ సందర్భంగా, NPCI భారత్ బిల్ పే లిమిటెడ్ CEO నూపుర్ చతుర్వేది మాట్లాడుతూ, “NPS విభాగాన్ని భారత్ కనెక్ట్ వేదికలో కలపడం ద్వారా, వ్యక్తులు తమ పదవీ విరమణ ప్లానింగ్‌ను సాఫిగా చేసుకునేలా తమ పెట్టుబడులను నిర్వహించడానికి వీలు కల్పించడంలో ఒక ముఖ్యమైన అడుగు కానుంది. ఈ ముందడుగు ద్వారా, ఫోన్‌పే యూజర్లు ఇప్పుడు యాప్ ద్వారా నేరుగా తమ NPS అకౌంట్లకు ఎలాంటి గట్టి ప్రయత్నం చేయకనే కంట్రిబ్యూట్ చేయవచ్చు. ఈ చొరవ భారతదేశం నలుమూలలా ఉన్న పౌరులకు మరింత యాక్సెస్ లభింపజేసి, వారిని కలుపుకుని పోయేలా చేయాలన్న మా సంకల్పాన్ని మరింత దృఢంగా చేసింది” అని అన్నారు.

ఫోన్ పే కన్సూమర్ పేమెంట్ల విభాగం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సోనికా చంద్ర మాట్లాడుతూ, “NPSకోసం కంట్రిబ్యూషన్లను ఆవిష్కరించడం కోసం భారత్ కనెక్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఫోన్‌పే, భారత్ కనెక్ట్‌ల మధ్య కుదిరిన ఈ భాగస్వామ్య ఒప్పందం మా లక్షలాది మంది యూజర్లకు సురక్షితమైన, యూజర్ ఫ్రెండ్లీ పేమెంట్ సొల్యూషన్ అందించడం ద్వారా NPS కంట్రిబ్యూషన్ల వినియోగం, సౌలభ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుంది. పేమెంట్స్, సేవింగ్స్ ప్రాసెసింగ్ ను ఇది మరింత తేలికైనదిగా, అందరికీ అందుబాటులోకి తెచ్చేదిగా ఉండడంతో భవిష్యత్తులో గణనీయమైన వృద్ధికి, వినూత్నమైన భాగస్వామ్యాలకు అవకాశాలున్నాయని మేము నమ్ముతున్నాము” అని అన్నారు.

- Advertisement -

యూజర్లు PhonePe యాప్‌లో ఈ ఫీచర్ ను కింది విధంగా అందుకోవచ్చు. :

● మీ PhonePe యాప్ హోమ్ స్క్రీన్ లోని ‘Recharges and Pay Bills/రీఛార్జిలు, బిల్లులు పే చేయి’ విభాగం కింద ‘View All/అన్నిటినీ చూడండి’పై క్లిక్ చేయండి.

● ‘ఫైనాన్షియల్ సర్వీసెస్, ట్యాక్సెస్’ కింద ‘నేషనల్ పెన్షన్ సిస్టం’పై క్లిక్ చేసి, కింది వివరాలను ఎంటర్ చేయండి.
○ మీ 12-అంకెల PRAN లేదా 10-అంకెల మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి
○ పుట్టిన తేదీ
○ నగర శ్రేణి
○ కంట్రిబ్యూషన్ అమౌంట్

● నియమ, నిబంధనలను అంగీకరించడం కోసం చెక్ బాక్స్ టిక్ చేసి, ‘Confirm/నిర్ధారించు’ను నొక్కండి.

● NPS పెట్టుబడి వివరాలు, అమౌంట్ విభజనను సమీక్షించండి.

● ‘Proceed to Pay/పే చేసేందుకు ముందుకెళ్లండి’ని నొక్కి, మీ ప్రాధాన్య పేమెంట్ పద్ధతిని ఎంచుకుని, పేమెంట్ పూర్తి చేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement