Tuesday, November 26, 2024

బంగారంలో పెట్టు బడులకోసం యూపీఐ ఎస్‌ఐపీని ఆవిష్కరించిన ఫోన్‌ పే

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : బంగారంలో పెట్టు బడులు పెట్టేందుకు వీలుగా యూపీఐ ఎస్‌ఐపీని ఆవిష్కరించామని భారతదేశపు అగ్రగామి డిజిటల్‌ పేమెంట్ల కంపెనీ ఫోన్‌పే శుక్రవారం ప్రకటించింది. ఈ ఆవిష్కరణ సందర్భంగా ఫోన్‌పే ఇన్వెస్ట్‌ మెంట్స్‌ విభాగం హెడ్‌ టెరెన్స్‌ లూసియన్‌ మాట్లాడుతూ… తమ 380 మిలియన్ల మంది వినియోగదారుల వేర్వేరు పెట్టుబడి అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తులు, ఆఫర్లను నిర్వహించాలన్నదే ఫోన్‌ పే దీర్ఘకాలిక వ్యూహమన్నారు. బంగారాన్ని కొనేందుకు భారతీయులు తెలివైన మార్గాలవైపు దృష్టి సారిస్తుండడంతో, తాము యూపీఐ ద్వారా బంగారం ఎస్‌ఐపీని సెటప్‌ చేసే ఎంపికను తమ వినియోగదారులకు అందించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు.

చిన్న, రెగ్యులర్‌ నెలవారీ పెట్టుబడుల ద్వారా స్వచ్ఛమైన 24కె బంగారాన్ని కొనేందుకు వారిని అనుమతించడం ద్వారా ఫోన్‌ పే బంగారం ఎస్‌ఐపీ వినియోగదారులకు తమ దీర్ఘకాలిక బంగారం పెట్టు-బడులను నిరంతరాయ మార్గంలో నిర్మించుకోవడంలో సహాయపడుతుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement