Thursday, November 14, 2024

Phonepe | డిజిటల్ పేమెంట్లతో స్థానిక ఆర్థిక కార్యకలాపాల మెరుగు

టియర్ 2 అండ్ 3 నగరాల్లో పెరిగిన ఆదరణపై ఫోన్‌పే ప్రభావం


హైద‌రాబాద్ : వివిధ ప్రాంతాల్లో పండుగలు జరుపుకునే పద్ధతిని డిజిటల్ పేమెంట్లు క్రమంగా మార్చేస్తున్నాయి. వీటి వల్ల పండుగలకు ఖర్చు పెట్టడం, వేడుకలకు పేమెంట్లు చేయడం సులభం, సౌకర్యవంతమైంది. సంస్కృతీ సంప్రదాయాలకు టెక్నాలజీ తోడవ్వడం వల్ల, ప్రజలు షాపింగ్ చేస్తున్నా, డబ్బు పంపినా, తీసుకుంటున్నా డిజిటల్ పేమెంట్లకే మొగ్గు చూపుతున్నారు. దీంతో వారు చిటికెలో బిల్లులు పే చేస్తున్నారు. చివరికి ఇన్వెస్ట్ చేయడం కూడా ఇప్పుడు చాలా సులభమైంది. ఈ డిజిటల్ పేమెంట్లు వినియోగదారులు, మర్చంట్ల మధ్య బిజినెస్ కార్యకలాపాల నిర్వహణను క్రమంగా మార్చేశాయి. వీటికి తోడు, డిజిటల్ పేమెంట్లు, ముఖ్యంగా పండుగల సమయంలో లోకల్ బిజినెస్‌లను సపోర్ట్ చేయడానికి, అలాగే ప్రోత్సహించడానికి కొత్త మార్గాలను పరిచయం చేస్తున్నాయి.

పండుగ షాపింగ్ అంతా ఎక్కువగా కిరాణా షాప్‌లు, విక్రేతలు, ఇంకా చిరు వ్యాపారాల చుట్టూనే తిరుగుతుంది. వీరి వద్దనే గిఫ్ట్‌లనూ కొనుగోలు చేస్తారు. దీంతో మర్చంట్లు ఇప్పుడు ఈ డిజిటల్ లావాదేవీల నుండి ఎంతో లాభపడుతున్నారు. ఫోన్‌పే వంటి ఫిన్‌టెక్‌ సంస్థలు ఈ డిజిటల్ మార్పులు తీసుకురావడంలో ముందంజలో ఉన్నాయి. ఫోన్‌పే భారత్‌కే పెద్దపీట అన్న నినాదంతో పనిచేస్తోంది. భారతీయ పౌరులందరికీ తమ జీవితాలను మెరుగు పర్చుకునే, ఆకాంక్షలను నెరవేర్చుకునే, అలాగే తమలో దాగి ఉన్న అసలు సిసలైన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి సహాయపడే ఒక ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించే లక్ష్యంతో పనిచేస్తోంది. భారతదేశం ప్రస్తుతం చూస్తున్న డిజిటల్ పేమెంట్ల విప్లవ ఫలితాల నుండి మరింత ప్రయోజనం పొందేందుకు వీలుగా వినియోగదారులు, అలాగే మర్చంట్లకు అవకాశం కల్పించడమే ఫోన్‌పే లక్ష్యం. దేశంలోని అగ్రస్థానంలో ఉన్న 8జిల్లాలను మినహాయిస్తే, మిగిలిన ప్రాంతాల్లోనే 80శాతం మంది యూజర్లు, మర్చంట్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఫోన్‌పే వల్ల వీరు ఈ కింది ప్రయోజనాలను పొందుతున్నారు. ఫోన్‌పే 2016లో డిజిటల్ పేమెంట్ల యాప్‌ను తీసుకువచ్చినప్పటి నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది దేశంలోని బ్యాంక్-యేతర ఫిన్‌టెక్ కంపెనీ ప్రారంభించిన మొట్టమొదటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారిత పేమెంట్ల యాప్.

- Advertisement -

గడిచిన ఎనిమిదేళ్లలో డిజిటల్ పేమెంట్లు చేసే, పొందే విధానంలో విప్లవాత్మక మార్పులను కంపెనీ తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న యూజర్లు, మర్చంట్లకు సౌలభ్యాన్ని, భద్రతను అందిస్తోంది. ఫోన్‌పే దేశంలోని 99శాతం పోస్టల్ కోడ్‌ల పరిధిలో ఉన్న ప్రాంతాల్లో తన సర్వీస్‌లను అందిస్తూ, 4కోట్ల మందికి పైగా మర్చంట్ల బిజినెస్‌ కార్యకలాపాలను డిజిటలైజ్ చేసింది. జనాభా ప్రమాణాలు మెరుగు పర్చడంలో భాగంగా, ఫోన్‌పే భారతదేశంలోని స్థానిక ఆర్థిక వ్యవస్థల్లో అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టించింది. ఫోన్‌పే సర్వీసులను ప్రారంభించినప్పటి నుండి, భారతదేశ వ్యాప్తంగా 22,000కు పైగా ఉద్యోగాలను సృష్టించింది.

అలాగే భారతదేశపు డిజిటల్ పేమెంట్ల విప్లవాన్ని శక్తివంతం చేయడానికి ప్రపంచ స్థాయి టెక్నాలజీ సొల్యూషన్లను క్రియేట్ చేస్తున్న దేశంలోని అత్యుత్తమ ఇంజినీర్లలో 1,500 పైగా మందిని నియమించింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ పద్ధతులు సహా డిజిటల్ పేమెంట్లు ఇప్పుడు అన్ని రకాల బిజినెస్‌ల్లోనూ భాగమయ్యాయి. అలాగే డిజిటలైజేషన్ వల్ల 100 కోట్ల మందికిపైగా అనూహ్యమైన అవకాశాలు ఆహ్వానం పలుకుతాయి. స్థానిక ఆర్థిక కార్యకలాపాలను డిజిటలైజేషన్ ఎలా ప్రోత్సహిస్తుందో తెలిపేందుకు గొప్ప ఉదాహరణే ఈ పండుగ షాపింగ్. ఈ విషయంలోనే భారతదేశపు డిజిటల్ పేమెంట్లు, ఇంకా ఫోన్‌పే వంటి కంపెనీలు ఉన్న ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్‌ కీలక పాత్ర పోషించి, యూజర్లు, మర్చంట్లకు ఒకేలా నగదు ప్రవాహాన్ని వేగవంతం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement