హైదరాబాద్ : భారతదేశపు అగ్రగామి డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫారం ఫోన్‌పే హైదరాబాద్‌లో కాన్ఫ్లూయెన్స్, కనెక్ట్ 2024 అనే రెండు ఫ్లాగ్షిప్ ఈవెంట్లను కలిపి తన పేమెంట్ గేట్‌వే సదస్సును విజయవంతంగా నిర్వహించింది. ఎస్ఎంఈలు, అవగాహన భాగస్వాములను శక్తివంతం చేసే దిశగా నిర్వహించిన ఈ అవగాహన, నెట్వర్కింగ్ సదస్సుకు ఈ రంగంలో అగ్రగాములుగా ఉన్న సంస్థలు, ఔత్సాహికులు, టెక్నాలజీ నిపుణులు హాజరయ్యారు. వెబ్ డెవలపర్లు, ఐటి సొల్యూషన్ స్ట్రాటజిస్టులు, ఈఆర్పీ కన్సల్టెంట్ల కోసం రూపొందించిన ఫోన్‌పే పీజీ కాన్ఫ్లూయెన్స్ ఫోన్‌పే పీజీ పార్టనర్ ప్రోగ్రాంలోని విశిష్ఠతలను అందించింది. ఫోన్‌పే పీజీ కనెక్ట్ 2024 ఇ-కామర్స్, డీ2సీ బ్రాండ్లపై దృష్టి సారించింది. ఈ ఈవెంట్‌కు హెరిటేజ్ ఫుడ్స్ సీఈవో శ్రీదీప్ కేశవన్ సహా 50 ఇ-కామర్స్, డీ2సీ బ్రాండ్ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈసందర్భంగా ఫోన్‌పే పేమెంట్ గేట్‌వే అండ్ ఆన్లైన్ మర్చంట్స్ విభాగం హెడ్ అంకిత్ గౌర్ కాన్ఫ్లూయెన్స్, కనెక్ట్‌లను కలపడం ద్వారా తాము వివిధ రంగాలను ఏకతాటిపైకి తెచ్చి, నాలెడ్జ్‌ను షేర్ చేసుకునేలా ఒక ప్రత్యేక ప్లాట్ ఫారంను క్రియేట్ చేశామన్నారు. ఈ ఫార్మట్ తమ భాగస్వాములు, మర్చంట్ల అవసరాలను పరిష్కరించే అవకాశాన్ని తమకు అందేలా చేసిందన్నారు. అదే సమయంలో తమ ప్రొడక్టులు, సర్వీసులను మెరుగు పరిచేందుకు అవసరమైన విలువైన అంశాలను కూడా తాము పొందామన్నారు.
హెరిటేజ్ ఫుడ్స్ సీఇఓ దీప్ కేశవన్ మాట్లాడుతూ… వ్యాపార సంస్థలు విజయవంతం కావడానికి అనేక రకాలైన వనరులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఒక్కో వ్యాపార సమస్యకు ఒక్కో ప్రత్యేకమైన పరిష్కారం అందుబాటులో ఉండవచ్చు కానీ తమ వినియోగదారులు ఏమి కోరుకుంటున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. చట్టబద్ధంగా కార్యకలాపాలు సాగించే వ్యాపార సంస్థలు చాలావరకు తమ కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోవడం కోసం డేటాను విరివిగా ఉపయోగిస్తున్నాయన్నారు. వివిధ సంస్థలు తమ వ్యాపారాలను విస్తరించుకునే క్రమంలో ప్రస్తుతం అవి పని చేస్తున్న తీరును అర్థం చేసుకుని, మారుతున్న ట్రెండ్స్ కు అనుగుణంగా తమను తాము సరి చేసుకోవడంలో కనెక్ట్లాంటి ఈవెంట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు.