Friday, November 22, 2024

8వ రోజూ స్థిరంగా పెట్రోధరలు..

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా 8వ రోజూ స్థిరంగా కొనసాగాయి. గురువారం పెట్రోధరల్లో ఎటువంటి మార్పులేదు. చివరిసారి ఈ నెల 6వ తేదీన లీటరు పెట్రోల్‌పై 80పైసలు పెరిగింది. మార్చి 22వ తేదీ నుంచి మొదలైన పెట్రోమోత మొత్తంఐ రూ.10వరకు పెరిగింది. ఈ నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లిdలో లీటర్‌ పెట్రోల్‌ ధర 105.41, లీటరు డీజిల్‌ ధర రూ.96.67వద్ద కొనసాగుతోంది. కాగా దేశీయ చమురు మార్కెటింగ్‌ సంస్థలు ధరలను గత నెల 22నుంచి క్రమంగా సవరిస్తున్నాయి.

23రోజుల కాలవ్యవధిలో 14రోజులు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. అంతకుముందు నాలుగున్నర నెలలపాటు స్థిరంగా ఉన్న ధరలు నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పెరగసాగాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.120.51, డీజిల్‌ రూ.104.77, చెన్నైలో పెట్రోల్‌ రూ.110.85, డీజిల్‌ రూ.100.94, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.115.12, డీజిల్‌ రూ99.83గా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement