పాకిస్తాన్లో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. తాజాగా లీటరు పెట్రోల్‌పై రూ. 6 పెంచారు.దాంతో ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ. 233.91కు చేరుకుంది. అదే సమయంలో డీజెల్ ధర రూ. 244.44, కిరోసిన్ రూ.199గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో హెచ్చుగ్గుల ప్రభావం సామాన్యులపై పడకుండా చూడాలని చమురు సంస్థలను ప్రభుత్వం కోరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పాకిస్తాన్‌కు నిర్దేశించిన పరిస్థితులకారణంగా, ఇక్కడి ప్రభుత్వం పెట్రోలియం సబ్సిడీలను భరించలేక పోతున్నదని ఫెడరల్ ఆర్థిక, రెవెన్యూ మంత్రి మిఫ్తాఇస్మాయిల్ చెప్పారు. ఇకపై పెట్రోల్ ఉత్పత్తులపై పన్నులు విధించడం లేదని, రాయితీలు ఇవ్వడం ద్వారా నష్టాలను భరించే స్థితిలో ప్రభుత్వం లేదని స్పష్టంచేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement