ప్రభన్యూస్: లిస్టింగ్ కంపెనీగా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత పేటిఎం తొలిసారి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ తో ముగిసిన రెండో త్రైమాసికంలో నష్టాలు మరింత పెరిగి రూ.473.5 కోట్లకు చేరాయని కంపెనీ వివరించింది. గత ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో నష్టం రూ.436.7 కోట్లుగా ఉందని ప్రస్తావించింది. అయితే కార్యకలాపాలపై ఆదాయం మాత్రం మెరుగుపడి రూ.1090 కోట్లకు పెరిగింది.
గతేడాది రెండో త్రైమాసికంతో పోల్చితే ఆదాయం 64 శాతం మేర పెరిగిందని స్టాక్ ఎక్స్చేంజీలకు పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ వెల్లడించింది. ఇక పేమెంట్లు, ఫైనాన్సియల్ సర్వీసులపై ఆదాయం ఏడాదిపరంగా 69 శాతం పెరిగి రూ.842.6 కోట్లకు పెరిగిందని కంపెనీ చెప్పింది. నాన్ యూపీఐ పేమెంట్ పరిమాణాలు(జీఎంవీ)లో 52 శాతం పెరగడం, ఫైనాన్సియల్ సర్వీసులు వృద్ధి నమోదవ్వడం ఆదాయం పెరుగుదలకు దోహదపడిందని ఫైలింగ్ లో పేటీఎం పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital