ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ ఇకపై పేమెంట్స్ యాప్‌గానూ సేవలు అందించబోతున్నది. ఇప్పటి దాకా సమాచారం పంచుకునేందుకు మాత్రమే పరిమితమైన ఈ యాప్‌ను, ఇక ఆల్ ఇన్ వన్‌గా మార్చేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే పేమెంట్స్ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.
కొత్త ఫీచర్‌కు సంబంధించిన విషయాన్ని స్క్రీన్‌షాట్ అనే ఓ వెబ్ డెవలపర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. లావాదేవీలు జరపడంతోపాటు, బ్యాలెన్స్, పేమెంట్స్ హిస్టరీ కూడా అక్కడే తెలుసుకోవచ్చని వెల్లడించాడు. అయితే ఎక్స్‌లో రాబోయే ఈ ఫీచర్ వాలెట్ సిస్టమ్ లాగా ఉంటుందా? లేదా నేరుగా బ్యాంక్ ఖాతాలకు లింక్ చేయవచ్చా? అనే విషయం తెలియాల్సి ఉంది.