మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, సర్ఫేస్ విభాగాలకు కొత్త బాస్‌గా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరి నియమితులయ్యారు. ఈ విభాగానికి నాయకత్వం వహించిన పనోస్ పనయ్ గతేడాది అమెజాన్‌లో చేరడంతో.. పవన్ దావులూరికి ఈ బాధ్యతలు అప్పగించారు.
2001లో మైక్రోసాఫ్ట్‌లో చేరిన పవన్.. మూడేళ్లుగా ఆ కంపెనీకి కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో విండోస్, సర్ఫేస్ విభాగాలు వేరువేరుగా అధిపతులు ఉండేవారు.., తాజాగా ఈ రెండింటి బాధ్యతలు పవన్ కే అప్పగించారు.