నిర్ణీత గడువులోగా పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోవడంతో దేశవ్యాప్తంగా 11.5 లక్షల పాన్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి. అనుసంధానికి ఇచ్చిన గడువు ఈ సంవత్సరం జూన్ 30తో ముగిసింది. దీంతో ఈ పాన్ కార్డులు డీయిక్టివ్ చేసినట్లు
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 70.24 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయి.
ఇందలో 57.25 కోట్ల మంది ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేసుకున్నారని సీబీడీటీ తెలిపింది. 12 కోట్ల పాన్‌కార్డుదారులు ఆధార్‌తో అనుసంధానం చేయలేదు. ఇందులో 11.5 కోట్ల కార్డులు డీయాక్టివ్ అయినట్లు తెలిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు సీబీడీటీ సమాధానం ఇచ్చింది.
2017 జులై 1 కంటే ముందు జారీ చేసిన పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయించడంతో సీబీడీటీ దీన్ని అమలు చేసింది. పాన్- ఆధార్ కార్డు అనుసంధానం చేసుకునేందుకు పలు మార్లు కేంద్రం గడువు పెంచింది. చివరి గడువుగా జూన్ 30 వరకు ఇచ్చింది.
డీయాక్టివేట్ అయిన కార్డులను పునరుద్ధరించుకునేందుకు సీబీడీటీ అవకాశం కల్పిస్తోంద. ఇందు కోసం 1000 రూపాయల ఫెనాల్టి చెెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయలేకపోయారు వారు. ఈ ఫెనాల్టిని చెల్లించి పాన్ కార్డును పునరుద్ధరించుకోవచ్చు. పాన్ కార్డు పునరుద్ధరించేందుకు 30 రోజుల సమయం పడుతుంది. డీయాక్టివ్ అయిన పాన్ కార్డులను లావాదేవీలకు ఉపయోగించుకోవడం కుదరదు.