హైదరాబాద్, (ప్రభ న్యూస్) : ఐటీ, కన్సల్టింగ్ సేవల్లో అంతర్జాతీయంగా అగ్రగామి సంస్ధ ఆబ్జెక్ట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఓటీఎస్ఐ) ఇప్పుడు నీతిఆయోగ్ ప్రతిష్టాత్మక నేషనల్ డాటా, ఎనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ (ఎన్‌డీఏపీ)ను అభివృద్ధి చేసింది. ఓటీఎస్‌ఐను సాంకేతిక భాగస్వామిగా ఎంపిక చేశారు. ఈసందర్భంగా ఓటీఎస్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్ర తాళ్లూరి మాట్లాడుతూ… ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అల్గారిథమ్స్ వినియోగించి పలు ప్రభుత్వ శాఖల నుంచి పొందిన సమాచారం పొందవచ్చన్నారు. తద్వారా రెండు విభిన్నమైన డాటా సెట్స్‌ను సరిపోల్చవచ్చన్నారు. అంటే దీనర్థం, వినియోగదారులకు అనుకూల రూపంలో ప్రభుత్వ సమాచారం లభిస్తుందన్నారు. ఇప్పటి వరకూ 30వేలకు పైగా సోర్స్ ఫైల్స్‌ను పలు శాఖల నుంచి ప్రాసెస్ చేయడంతో పాటుగా వాటిని ఎన్‌డీఏపీపై 203 డాటా సెట్లతో మిళితం చేశామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..