రెనో సిరీస్‌లో ఒప్పో మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. రెనో 12, రెనో 12 ప్రో పేర్లతో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. కృత్రిమ మేథ ఫీచర్లతో ఈ ఫోన్లను రూపొందించింది. రెనో 12 ప్రో విషయానికొస్తే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, 1200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, ఫ్లెక్సిబుల్ అయోలెడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రోటెక్షన్‌తో కూడిన 6.7 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది.
అలాగే 8ఎంపీ అల్ట్రావైడ్, ఓఐఎస్ సపోర్ట్ ను కలిగివుంది. 8కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 80వాట్స్ సూపర్‌వూక్ ఫాస్టింగ్ రీచార్జింగ్‌తో పవర్‌ఫుల్ బ్యాటరీని కలిగివుంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ -సీ, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆధారిత కలర్ ఓఎస్ 14.1తోపనిచేస్తుంది. దీని ప్రారంభ ధరను రూ.36,999గా నిర్ణయించారు.
అలాగే రెనో 12 విషయానికొస్తే, 32,999 రూపాయల ప్రారంభ ధరతో వస్తోంది. ఇందులో 6.7 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్, 120 హెడ్జ్ రీఫ్రెష్ రేటు, 1200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 3డీ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్‌తో కూడిన డిస్‌ప్లే ఇచ్చారు. ఇందులోనూ 12 ప్రో మాదిరిగానే ఏఐ ఫీచర్లతోపాటు ఏఐ లింక్‌బూస్ట్, ఏఐ బెకన్‌లింగ్ ఫీచర్లను ఇచ్చారు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 512 జీబీ స్టోరేజీ గా రెండు వేరియంట్లతో అందుబాటులో ఉంది.