హైదరాబాద్, (ప్రభ న్యూస్) : ప్రఖ్యాత అంతర్జాతీయ స్మార్ట్-డివైస్ బ్రాండ్ ఒప్పో తన కె సిరీస్‌లో సరికొత్త కే10 5జీని గురువారం ఆవిష్కరించింది. ఇది ఒప్పో గ్లో 7.99ఎంఎం అల్ట్రా స్లిమ్ డిజైన్‌తో కూడిన ఫోన్ ఇది. 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ కలిగి ఈ ఈ స్మార్ట్‌ఫోన్‌ను 5జీబీ ర్యామ్ వరకు పెంచుకోవచ్చు. స్టైలిష్ డిజైన్, అసమా నమైన పనితీరుతో మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ చిప్సెట్ శక్తిని కలిగి ఉంది.
5000ఎంఎహెచ్ బ్యాటరీతో కూడిన ఈ అత్యంత సన్నని 5జీ స్మార్ట్‌ఫోన్ మెరుపు వేగంతో ఛార్జింగ్ అందించే 33డబ్ల్యూ సూపర్ వీఓఓసీటీఎం టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. కే10 5జీ టైప్‌సీ ఛార్జింగ్, 3.5ఎంఎం ఆడియో జాక్ కలిగి ఉంది. ఈ డివైస్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్స్ ఓఎస్ 12.1 పై రన్ అవుతుంది. టాప్ క్లాస్ ఆడియో సిస్టమ్, సౌండ్ ఎన్హాన్స్మెంట్ స్పెషలిస్ట్ డైరాక్తో ఒప్పో భాగస్వామ్యం కలిగి ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.