ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో కొత్త కొత్త డివైజ్‌లను మార్కెట్‌లోకి ఇంట్రడ్యూస్ చేస్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్, ఫ్లాగ్‌షిప్ డివైజ్‌లు లాంచ్ చేస్తూ మార్కెట్ వాటాను పెంచుకుంటోంది. ఇప్పుడు భారతదేశంలో లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్ ఒప్పో ఫైండ్ N3ని లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ ఫోన్ అక్టోబర్ 12న లాంచ్ అవుతుందని ప్రకటించింది. ఫ్లిప్ ఫోన్ పవర్‌ఫుల్ ప్రాసెసర్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్, హై- పర్ఫార్మెన్స్ ఫీచర్‌లతో వస్తుందనే విశ్లేషణలు లాంచ్ ఈవెంట్‌పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
ఒప్పో ఇప్పటికే లాంచ్ ఈవెంట్ కోసం మీడియాకు ఆహ్వానాలు పంపడం ప్రారంభించింది. కస్టమర్లు ఒప్పో యూట్యూబ్ ఛానెల్‌లో 7 PM ISTకి లాంచ్ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో రిలీజ్ అయింది. అదే వెర్షన్ ఇండియాలోకి కూడా అడుగుపెడుతున్నట్లు భావిస్తున్నారు.
ఒప్పో ఫైండ్ N3 ఫీచర్లు
ఫైండ్ N3 ఫ్లిప్ 6.8-అంగుళాల FHD+ మెయిన్ డిస్‌ప్లేతో వస్తుంది, ఇది 1080*2520 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా AMOLED డిస్‌ప్లే స్మూత్ 120 Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. SCHOTT UTG గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ పొందుతుంది.
ఫైండ్ N3 ఫ్లిప్ 3.26-అంగుళాల ఎక్స్‌టెర్నల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 382*720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ సపోర్ట్ ఉంటుంది.
ఫైండ్ N3 ఫ్లిప్ అడ్వాన్స్‌డ్ సెకండ్ జనరేషన్ TSMC 4nm ప్రాసెస్ బేస్డ్ ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 9200 SoC చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB LPDDR5X RAMతో వస్తుంది, ఇది మునుపటి జనరేషన్ LPDDR5 కంటే 33 శాతం వేగంగా ఉంటుంది.
ఫోన్ కస్టమ్ ColorOS 13.2తో సరికొత్త ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. స్మూత్, యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ కన్వీనియంట్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ 256 GB, 512GB వేరియంట్‌లలో లభిస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేసే 4,300 mAh బ్యాటరీతో వస్తుంది.
కెమెరా అప్‌డేట్స్
ఒప్పో లేటెస్ట్ ఫ్లిప్ పవర్‌ఫుల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది. వైడ్ f/1.8 ఎపర్చరుతో 50MP మెయిన్ షూటర్, f/2.2 ఎపర్చరుతో 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, f/2.0 ఎపర్చరుతో 32MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ ఇష్టపడే వారి కోసం క్లియర్, షార్ప్ సెల్ఫీలను అందించేందుకు 32MP ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది.
Find N3 Flip ధరను ఒప్పో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ అంచనా ప్రకారం.. అన్ని అప్‌గ్రేడ్‌ల సహా దీని ధర రూ.90,000 కంటే ఎక్కువగా ఉండవచ్చు.