Tuesday, November 19, 2024

OpenAI | ఛాట్‌జీపీటీ లో మ‌రో సూప‌ర్ ఫీచర్..

ప్ర‌ముఖ‌ ఏఐ కంపెనీ ఓపెన్ఏఐ తమ‌ అత్యంత అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ మోడల్ జీపీటీ-4 టర్బో కోసం లేటెస్ట్ అప్‌డేట్‌ను అనౌన్స్ చేసింది. మల్టీమీడియా ఇన్‌పుట్‌లను విశ్లేషించడానికి ఛాట్‌జీపీటీ ఏఐ మోడల్స్ ఇప్పుడు దృష్టి సామర్థ్యాలను కూడా కలిగి ఉన్నట్టు పేర్కొంది. దీంతో ఛాట్‌జీపీటీ ఇప్పుడు ఫొటోలను కూడా అనలైజ్ చేయగలదు. వినియోగదారులకు దాని ఇన్‌సైట్స్‌ను చూపగలదు.

ఛాట్‌జీపీటీ కొత్త ఫీచర్…

ఛాట్‌జీపీటీకి వస్తున్న ఈ కొత్త ఫీచర్ ఏపీఐలోని డెవలపర్‌లకు, అలాగే ఛాట్‌జీపీటీ ద్వారా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఓపెన్ఏఐ డెవలపర్లు ఎక్స్ (ట్విట్లర్)లో వారి అధికారిక ఖాతా నుంచి ఒక పోస్ట్‌లో జీపీటీ-4 విజన్‌ని ప్రకటించారు. “GPT-4 Turbo with Vision ఇప్పుడు ఏపీఐలో అందుబాటులో ఉంది. విజన్ రిక్వెస్ట్‌లు, జేఎస్ఓఎన్ మోడ్, ఫంక్షన్ కాలింగ్‌ని కూడా ఇప్పుడు ఉపయోగించవచ్చు” అని ఈ పోస్ట్ ద్వారా ప్రకటించారు.

దృష్టి సామర్థ్యాలతో జీపీటీ-4 టర్బో ఏ ఫొటోను అయినా అనలైజ్ చేయగలదు. దాని గురించి పూర్తి సమాచారాన్ని వినియోగదారులకు అందించగలదు. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందో కంపెనీ కొన్ని ఉదాహరణలను కూడా షేర్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక బ్రాండ్‌లు దృష్టి సామర్థ్యాలతో అప్‌డేట్ చేసిన ఏపీఐని ఉపయోగిస్తున్నాయి.

ఈ ఫీచర్‌లోని ప్రత్యేకతలు…

- Advertisement -

ఛాట్‌జీపీటీ ప్లస్ వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. దీని కోసం వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఛాట్‌జీపీటీ… ఈ కొత్త విజన్ ఫీచర్ ద్వారా….. వినియోగదారులు ఏదైనా చిత్రాన్ని ఛాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేస్తే, అది ఆ ఫొటోకు సంబంధించిన పూర్తి వివరాలను, దానికి సంబంధించిన ఇన్‌సైట్స్‌ను తెలియజేస్తుంది. ఉదాహరణకు తాజ్ మహల్ ఫోటోను ఛాట్‌జీపీటీకి పంపితే, అది మీకు తాజ్ మహల్ ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకత ఏంటి? ఎప్పుడు నిర్మించారు? దానిని నిర్మించడానికి ఏ రాళ్లను ఉపయోగించారు మొదలైన వాటి గురించి సమాచారాన్ని అందిస్తుంది.

బెంగుళూరుకు చెందిన హెల్తిఫై మీ తన కస్టమర్‌ల కోసం మాక్రోలను సులభంగా ట్రాక్ చేయడానికి దృష్టి సామర్థ్యాలతో అప్‌డేట్ చేసిన ఏపీఐని కూడా ఉపయోగిస్తోంది. దీని సహాయంతో వినియోగదారులు తమ కెమెరాకు తినే ఆహారాన్ని చూపించాలి. దాన్ని ఏఐ మోడల్ మాక్రోలకు తెలియజేసి విశ్లేషిస్తుంది. మీరు ఆహారాన్ని తిన్న తర్వాత నడవాల్సిన అవసరం ఉందా లేదా అని సూచిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement