Friday, November 22, 2024

కొనసాగుతున్న మార్కెట్ల నష్టాలు.. మరింత దిగువకు స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం కూడా నష్టాల్లో ముగిశాయి. ఈ వారం ఆరు రోజుల్లో ఒక్క రోజుకూడా మార్కెట్లు లాభాల్లో ముగియలేదు. 2020 మే తరువాత ఇలా మార్కెట్లు భారీగా పతనం అవ్వడం ఇదే మొదటిసారి. శుక్రవారం నాడు ఒక దశలో సెన్సెక్స్‌ 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇంట్రాడేలో స్వల్ప ఊరట లభించినప్పటికీ చివరకు నష్టాల్లోనే మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్‌ 135.37 పాయింట్ల నష్టంతో 51,360.42 పాయింట్ల వద్ద ముగిసిం ది. నిఫ్టీ 67.10 పాయింట్లు నష్టపోయి 15,293.50 వద్ద ముగిసింది. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్‌ ్వ, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యు, అపోలో ఆస్పటల్‌, ఐటీసి, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సి వంటి షేర్లు లాభపడ్డాయి. టైటాన్‌, విప్రో, శ్రీ సిమెంట్స్‌, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ ఫార్మా, ఎల్‌ అండ్‌ టీ, మారుతి, ఎన్టీపీసీ వంటి షేర్లు నష్టాలతో ముగిశాయి. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ 0.75 శాతం వడ్డీ రేట్లను పెంచడంతో పాటు, పరిస్థితి అదుపులోకి రాకుంటే మరింత పెంపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇది మార్కెట్లను దెబ్బతీసింది.

మరిన్ని దేశాలు కూడా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వడ్డీ రేట్లు పెంచనున్నాయని వార్తలు వచ్చాయి. దీంతో ఆర్థిక మాంధ్యం తప్పదన్న సంకేతాలు మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఫలితంగా వరసగా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. దేశంలో 2030 నాటికి బొగ్గు ఉత్పత్తిని నాలుగింతలు పెంచుతామని కోల్‌ ఇండియా ప్రకటించడంతో ఆ సంస్థ షేర్లు 1.47 శాతం పెరిగి, 182.70 వద్ద ట్రేడ్‌ అయ్యాయి. పంచదార ఎగుమతులపై నిషేధం విధిస్తారన్న వార్తల నేపథ్యంలో వాటి షేర్లు నష్టపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బంగారం 10 గ్రాముల ధర 42 రూపాయలు తగ్గి 50944 వద్ద ట్రేడ్‌ అయ్యింది. కేజీ వెండి ధర 386 రూపాయలు తగ్గి 61141 రూపాయలగా ఉంది. డాలర్‌తో మారకపు విలువ 77.83 రూపాయల ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement