Thursday, October 31, 2024

OnePlus 12R | భారత్ మార్కెట్‌లో వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్.. ఆఫర్లు, స్పెపిఫికేషన్‌లు ఇవే !

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ తమ ఫోన్లపై సేల్ ప్రకటించింది. అందులో ఇప్పటికే వన్‌ప్లస్ 12 విక్రయించగా. ఇప్పుడు మరో స్మార్ట్‌ఫోన్ OnePlus 12R మొదటిసారిగా భారతీయ మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. ఈ నెల (ఫిబ్రవరి)6న మార్కెట్లో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం OnePlus India వెబ్‌సైట్ & Amazonలో అందుబాటులో ఉంది. ఇక ఫోన్‌పై కొనుగోలుదారులలో ఆసక్తిని పెంచడానికి, కంపెనీ కొన్ని బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందించింది. భారతదేశంలో ఈ కొత్త OnePlus 12R ధర మరియు స్పెసిఫికేషన్‌లు ఎలా ఉన్నాయో చూద్దాం..

వన్‌ప్లస్ 12ఆర్ బేస్ మోడల్ రూ.39,999 ప్రారంభ ధరలో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో అందిస్తుంది. 16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో కూడిన మరో వేరియంట్ ధర రూ.45,999కు పొందవచ్చు. లాంచ్‌లో భాగంగా వన్‌ప్లస్ 12ఆర్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, వన్‌కార్డ్ హోల్డర్‌లపై రూ.1,000 బ్యాంక్ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అదనంగా, వన్‌ప్లస్ 12ఆర్ కొనుగోలుదారులు కంపెనీ అందించిన వివరాల ప్రకారం.. 6 నెలల గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్, మూడు నెలల యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వాన్ని పొందవచ్చు.

వన్‌ప్లస్ 12ఆర్ స్పెసిఫికేషన్లు :

ఈ డివైజ్ 6.78-అంగుళాల అమోల్డ్ ఎల్‌టీపీఓ డిస్‌ప్లేను 1264 x 2780 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో కలిగి ఉంది. 4,500 నిట్స్ గరిష్ట ప్రకాశం, 360హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 120హెచ్‌‌జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ డివైజ్ అల్యూమినియం అల్లాయ్ మెటల్ మిడిల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంది.

హుడ్ కింద వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ 4ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. 12జీబీ లేదా 16జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఆప్షన్లు అడ్రినో 740 జీపీయూ ద్వారా అందిస్తుంది. యూఎఫ్ఎస్ 4.0 టెక్నాలజీతో 1టీబీ వరకు స్టోరేజీ ఆప్షన్లను అందిస్తుంది.

- Advertisement -

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ ఏస్ 3 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్/1.8 లెన్స్, ఓఐఎస్‌తో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్890 ప్రైమరీ సెన్సార్, ఎఫ్/2.2 లెన్స్‌తో కూడిన 8ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, ఎఫ్/2.4 లెన్స్‌తో 2ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి.

సెల్ఫీల విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ 16ఎంపీ సెన్సార్ ఉంది. ఈ డివైజ్ శక్తివంతంగా ఉండేందుకు 100డబ్ల్యూ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో గణనీయమైన 5,500ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. వన్‌ప్లస్ ఏస్ 3 డాల్బీ అట్మోస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement