Saturday, September 14, 2024

One Plus | స్పెషల్‌ ఎడిషన్‌… లాంచ్ డేట్ ఫిక్స్

వన్‌ప్లస్‌ కొత్త వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ త్వరలో విడుదల కానుంది. వన్‌ప్లస్‌ ఓపెన్‌ అపెక్స్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీని సంస్థ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ను ఆగస్టు 7వ తేదీన విడుదల కానుంది. హాసెల్‌బ్లాడ్ 503CW విక్టర్ రెడ్ ఎడిషన్‌కు 60 సంవత్సరాల నివాళిగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్పెషల్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌, క్రిమ్సన్‌ రెడ్‌ కలర్‌ను కలిగి ఉంటుంది.

స్పెసిఫికేషన్ల వివరాలు

ఈ స్పెష‌ల్ ఎడిషన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇమేజ్‌ ఎడిటింగ్‌ టూల్‌ ఫీచర్‌ సహా మెరుగైన స్టోరేజీ, సెక్యూరిటీ ఫీచర్‌లతో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ ఫోన్ కేవలం సింగిల్‌ స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

ఈ స్పెషల్‌ ఎడిషన్ ధర రూ.1,39,999 గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ స్పెసిఫికేషన్‌లు, ధరలపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే వన్‌ప్లస్‌ ఓపెన్‌ అపెక్స్‌ స్పెషల్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement