అమెరికాకు చెందిన ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ మరోసారి ఉద్యోగులపై వేటు వేసింది. అమెజాన్ కమ్యూనికేషన్స్ విభాగంలోని అమెజాన్ స్టూడియోస్, అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్‌లో పని చేస్తున్న 5 శాతం ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ గ్లోబల్ కమ్యూనికేషన్ టీమ్‌లో పని చేస్తున్నవారిలో వీరు ఒక శాతం ఉద్యోగులకు సమానమని డెడ్‌లైన్ తన కథనంలో పేర్కొంది.
సంఖ్యాపరంగా ఎంతమందిని తొలగించింది అమెజాన్ అధికారికంగా ప్రకటించలేదు. తాజా లేఆఫ్‌లు అమెరికాతో పాటు, ఇతర లొకేషన్లలో పని చేస్తున్న వారినీ తొలగిస్తున్నట్లు తెలిపింది. లేఆఫ్‌కు గువుతున్న ఉద్యోగులకు 60 రోజుల వేతనంతో పాటు, ప్రయోజనాలు అందిస్తామని కంపెనీ తెలిపింది. పరిహార ప్యాకేజీ కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు సహకారం వంటివి అందిస్తామని అమెజాన్ తెలిపింది.
వ్యాపార అవసరాలకు అనుగుణంగా టీమ్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటామని, తాజాగా జరిగిన రివ్యూలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని అమెజాన్ అధికార ప్రతినిధి బ్రాడ్ గ్లాస్సర్ తెలిపారు. కమ్యూనికేషన్ విభాగంలో స్వల్ప సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2022 నవంబర్, 2023 జనవరిలో రెండు సార్లు 18 వేల మంది ఉద్యోగులను అమెజాన్ తొలగించింది.