Saturday, November 2, 2024

Retail sales | దీపావళికి రికార్డు స్థాయిలో 3.75 లక్షల కోట్ల అమ్మకాలు

దీపావళి సందర్భంగా దేశమంతా భారీ స్థాయిలో రిటైల్‌ అమ్మకాలు జరిగాయి. ఈ సీజన్‌లో రికార్డ్‌ స్థాయిలో 3.75 లక్షల కోట్ల అమ్మకాలు జరిగినట్లు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) తెలిపింది. ఈ పండగల సీజన్‌లో ఇంకా గోవర్ధన్‌ పూజ , భయ్యా దూజ్‌, ఛత్‌ పూజ, తులసి వివావ్‌ వంటివి జరగాల్సి ఉందని పేర్కొంది. ఈ పండగల సీజన్‌లో మరో 50,000 కోట్ల మేర అమ్మకాలు జరుగుతాయని పేర్కొంది. ఈ దీపావళి సందర్భంగా దాదాపు అన్ని భారతీయ ఉత్పత్తులే అమ్మకాలు జరిగినట్లు తెలిపింది.

ఈ దీపావళి సీజన్‌లో చైనా వస్తువులు లక్ష కోట్లకు పైగా బిజినెస్‌ను కోల్పోయాయని సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ తెలిపారు. గతంలో దీపావళి పండుగల సందర్భంగా మార్కెట్‌లో 70 శాతానికి పైగా చైనా వస్తువులు ఉండేవని, ఈ సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన వోకల్‌ ఫర్‌ లోకల్‌ నినాదం బాగా పని చేసిందన్నారు. ఈ నినాదం ప్రభావంతో వ్యాపారులు కూడా చైనాతో పాటు విదేశీ వస్తువులకు బదులు స్థానిక వస్తువులనే సేకరించి, అమ్మకాలు చేశారని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement