ఓలా ఎలక్ట్రికల్స్ దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో లిథియం ఐయాన్ బ్యాటరీ సెల్‌ను అభివృద్ధి చేసింది. ప్రత్యేకమైన రసాయనాలు, మెటియల్‌ను ఉపయోగించి దీన్ని తయారు చేసినట్లు కంపెనీ ఫౌండర్ సీఈవో భవేష్ అగర్వాల్ తెలిపారు. ఈ లిథియం ఐయాన్ సెల్‌కు ఎన్‌ఎంసీ 2170 అని పేరు పెట్టారు. దీన్ని తమిళనాడులోని ఉన్న తమ గిగా ప్యాక్టరీలో 2023 నుంచి ఉత్పత్తి చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ సెల్ ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసే సమార్ద్యంతో లభిస్తుంది. దేశంలో తొలిసారి ఓలా ఎలక్ట్రికల్ అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధాన కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, ఇందులోనే ఈ సెల్‌ను డెవలప్ చేసినట్లు చెప్పారు. ఇది పూర్తిగా దేశీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తయారు చేసామని, కొత్త టెక్నాలజీ వల్ల సెల్ లైఫ్ టైమ్ పెరుగుతుందన్నారు.
దేశీయంగానే లిథియం ఐయాన్ సెల్‌ను తయారు చేయడం దేశంలో ఇదే తొలిసారని చెప్పారు. ప్రస్తుతం ఈవీ వాహనాలను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు ఈ సెల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. కంపెనీ ఆర్ అండ్ డి పై మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత నిపుణులైన వారిని తీసుకున్నామని చెప్పారు. రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో 500 మంది పిహెచ్‌డీ చేసిన నిపుణులు, ఇంజనీర్లు ఉన్నారని తెలిపారు. ఓలా ఎలక్ట్రికల్ కారును కూడా త్వరలోనే మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. విద్యుత్ వాహనాలకు కావాల్సిన పలు ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసేందుకు ఓలా కృషి చేస్తుందని ఆయన వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.