ఈ దీపావళీకి ఓలా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 80 వేల రూపాయల ధరలో లాంచ్ చేయనుంది. ఓలా ఎస్1 కంటే ఇది తక్కవ ధరలోనే రానుందని కంపెనీ సీఈఓ భావిష్ అగర్వాల్ ట్విట్ చేశారు. ఈ స్కూటర్లో ఫీచర్స్ అన్నీ ఎస్1లో మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఓలా ఎస్1, ఎస్1 ప్రో పేరుతో రెండు స్కూటర్లను విక్రయిస్తోంది. ఎస్1 స్కూటర్ ధర 99,999 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం ఓలాలో మ్యూజిక్ ప్లేయర్, నావిగేషన్, రివర్స్ మోడ్ వంటి పలు ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఓలా ప్రస్తుతం రోజుకు 10000 స్కూటర్లను విక్రయిస్తోంది. ఓలా త్వరలోనే ఒక ఛార్జింగ్‌లో 500 కిలోమీటర్లు ప్రయాణీంచే కారును మార్కెట్లో విడుదల చేయనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement