Tuesday, November 19, 2024

ఓలా టార్గెట్‌ మరో 10 లక్షల వాహనాలు.. ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీ

దేశీయ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ఓలా 2023 నవంబర్‌ నాటికి 10 లక్షల యూనిట్ల వరకు ఉత్పత్తి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓలా ప్రస్తుతం సంవత్సరానికి లక్ష వాహనాల ఉత్పత్తి చేస్తోంది. నవంబర్‌ 2022 నాటికి లక్ష, 2023, నవంబర్‌ నాటికి 10 లక్షలు, 2024 నవంబర్‌ నాటికి కోటీ వాహనాల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భావిష్‌ అగర్వాల్‌ ట్విట్‌ చేశారు.

దేశ వ్యాప్తంగా వచ్చే వారం నుంచి కస్టమర్లకు వాహనాలను బుక్‌ చేసుకున్న రెండు మూడు రోజుల్లో డెలివరీ ఇస్తామని ఆయన ప్రకటించారు. తమిళనాడులోఎని క్రిష్ణగంజ్‌లో ఉన్న ఓలా ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచుతున్నామని భావిష్‌ అగర్వాల్‌ గత నెలలో ప్రకటించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. అక్టోబర్‌లో ఒక్క నెలలోనే ఓలా 20 వేల ఇ-స్కూటర్స్‌ను విక్రయించింది.

ప్రస్తుతం ఓలా ఎస్‌1 ప్రో, ఎస్‌1 మోడల్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ను విక్రయిస్తోంది. ఓలా ఎస్‌1 ఏయిర్‌ పేరుతో లాంచ్‌ చేసిన కొత్త స్కూటర్‌ బుకింగ్స్‌ను 2023 ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది. ఓలా వచ్చే సంవత్సరం ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ను మార్కెట్‌లో విడుదల చేయనుంది. త్వరలోనే ఓలా కారు కూడా మార్కెట్‌లోకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement