Saturday, November 23, 2024

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

స్కూటీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లోకి వచ్చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓలా కంపెనీ ఈ స్కూటర్‌ను విడుదల చేసింది. ఎస్‌1‌, ఎస్‌1 ప్రో అనే రెండు వేరియంట్లలో ఓలా ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రివర్స్‌ మోడ్‌లో వస్తున్న అతికొద్ది ద్విచక్రవాహనాల్లో ఇదొకటి. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 181 కి.మీ(ఎస్‌1 ప్రో) వరకూ ప్రయాణించవచ్చు. 115 కి.మీ గరిష్ఠ వేగాన్ని అందుకోగలదు. బిల్ట్‌ ఇన్‌ స్పీకర్స్‌, స్మార్ట్‌ ఫోన్‌తో లాక్‌-అన్‌లాక్‌ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఉన్నాయి.

✪ మూడు సెకన్లలో గంటకు 40 కి.మీ. వేగాన్ని.. ఐదు సెకన్లలో 60 కి.మీ వేగాన్ని అందుకోగలదు.
✪ ఎస్‌1 ప్రారంభ ధర రూ.99,999, ఎస్‌1 ప్రో ధర రూ.1,29,999. ఫేమ్‌ రాయితీ కింద ఈ ధర మరింత తగ్గుతుంది. ఢిల్లీలో దీని ధర రూ.85,099, గుజరాత్‌లో రూ.79,999, మహారాష్ట్రలో రూ.94,999, రాజస్థాన్‌లో రూ.89,968.
✪ ఎస్‌1 ప్రో లో 3.97 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ, ఎస్‌1లో 2.98 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీని పొందుపరిచారు.
✪ పూర్తిగా ఎల్‌ఈడీ లైట్లు. మొత్తం 10 రంగుల్లో అందుబాటులో ఉంది.
✪ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా లాక్‌-అన్‌లాక్‌ను ఆపరేట్‌ చేయవచ్చు.
✪ నార్మల్‌, స్పోర్ట్‌, హైపర్‌ అనే మూడు డ్రైవింగ్‌ మోడ్‌లు ఉన్నాయి.
✪ స్క్రీన్‌లో ఉండే ‘మూడ్స్‌’ అనే ఫీచర్‌లో పలు రకాల ఒడోమీటర్‌ సెట్టింగ్‌లను పొందొచ్చు.
✪ ‘బిల్ట్‌ ఇన్‌ స్పీకర్ల’తో ఫోన్‌ కాల్స్‌ కూడా రిసీవ్‌ చేసుకోవచ్చు.

ఈ వార్త కూడా చదవండి: మేం పన్నులు తగ్గిస్తే మీరేం చేస్తారు?: టెస్లాకు కేంద్ర ప్రభుత్వం ప్రశ్న

Advertisement

తాజా వార్తలు

Advertisement