ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తమ విద్యుత్ స్కూటర్ల పై డిస్కౌంట్ ప్రకటించింది. ఫిబ్రవరి నెలకు ఎంపిక చేసిన స్కూటర్లపై 25 వేల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఎస్1 ప్రో, ఎస్ ఎయిర్, ఎస్1 ఎక్స్ ప్లస్, మోడళ్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఎస్1 ప్రో మోడల్ ప్రస్తుత ధర 1,47,499 రూపాయలుగా ఉంది, డిస్కౌంట్ తరువాత దీన్ని 1.29 లక్షలకు విక్రయించనున్నట్లు తెలిపారు.
ఎస్1 ఎయిర్ మోడల్ ధర 1.19 లక్షలు ఉంది. డిస్కౌంట్ ఆఫర్లో 1.04 లక్షలకు, ఎస్1 ఎక్స్ ప్లస్ ధర 1.09 లక్షల ఉంటే, దాన్ని 84,999 రూపాయలకు విక్రయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. డిస్కౌంట్ ధరలు ఫిబ్రవరి 16 నుంచే అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. ఓలా ఎలక్ట్రిక్ జనవరిలోనూ కొన్ని మోడల్స్‌పై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. జనవరిలో ఓలాపై కంపెనీ 20వేల డిస్కౌంట్ ప్రకటించింది.
ఓలా సంస్థ ఇటీవల ఎస్1 ఎక్స్ శ్రేణిలో 4కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో కొత్త స్కూటర్‌ను తీసుకు వచ్చింది. దీని ధరను 1.09 లక్షలుగా నిర్ణయించింది. ఇది సింగిల్ ఛార్జింగ్‌తో 190 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 80 వేల కి.మీ వరకు ఎక్స్టెండెడ్ వారెంటీని ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది.