Wednesday, October 9, 2024

HYD: స్టాట్యూ ఆఫ్ యూనిటి నుండి మాటర్ మిషన్ ఏరథాన్ భారత్ అధికారికంగా ప్రారంభం

హైద‌రాబాద్ : భారతదేశపు ప్రముఖ ఎలెక్ట్రిక్ మొబిలిటి కంపెనీ, మాటర్ గ్రూప్ స్టాట్యూ ఆఫ్ యూనిటి నుండి తన మిషన్ ఏరథాన్ భారత్ ను అధికారికంగా ప్రారంభించింది. ఏరథాన్ భారత్ అనేది వినూత్నమైన, సుస్థిరమైన మొబిలిటి పరిష్కారాలపై అవగాహనను ప్రోత్సహిస్తూ భారతదేశ ప్రజలను ఒకే ప్లాట్ఫార్మ్ పైకి తీసుకొచ్చేందుకు చేయబడుతున్న ఒక ప్రయత్నం. విభిన్నమైన మన దేశ భూభాగాల వెంబడి అభివృద్ధి చెందుతున్న ఈ పరిష్కారాలు బహుముఖంగా, విశ్వసనీయంగా ఉండేందుకు రూపొందించబడ్డాయి.

ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రయాణం ప్రారంభ స్థానం, సర్దార్ వల్లభభాయ్ పటేల్ కు ఒక నివాళిగా, భారతదేశపు శక్తి, ఐక్యత ముందుచూపున‌కు ప్రతీకగా నిలుస్తుంది. ఇది సుస్థిర‌మైన‌, పర్యావరణానుకూల రవాణా వైపున‌కు తన మార్పుతో భారతదేశాన్ని ఒక్కటిగా చేయాలనే మాటర్ మిషన్ ను ప్రతిబింబిస్తుంది. స్టాట్యూ ఆఫ్ యూనిట్ అద్భుతమైన నేపథ్యంలో, ఏరథాన్ భారత్ ఎలెక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో ఒక పరివర్తనాత్మక కదలికల కొరకు ఒక టోన్ సెట్ చేస్తుంది.

- Advertisement -

ఈసంద‌ర్భంగా మాటర్ వ్యవస్థాపకులు మాటర్ బృందంతో కలిసి మాట్లాడుతూ… మాటర్ లో తాము శిలాజ ఇంధనాల నుండి సుస్థిరమైన ఎనర్జీ, మొబిలిటి ఎంపికల వైపుకు పరివర్తన కోసం ఒక ఉత్ప్రేరకంగా ఉండాలనేది త‌మ ధ్యేయమన్నారు. గ్రహాన్ని పరిరక్షిస్తూ అలుపెరగని ఎలెక్ట్రిక్ మోటార్ బైక్స్ అందిస్తూనే జీవితాలను సుసంపన్నం చేసే రవాణాను అందించడం త‌మ మిషన్ అన్నారు. రోజువారి ప్రయాణానికైనా లేదా కొత్త ప్రాంతాలకు సాహస ప్రయాణాలకైనా, ప్రతి రైడ్ ఒక స్వేచ్చాయుతమైన భావనను కలిగించాలన్నారు. భవిష్యత్తు గురించిన అపరాధ భావనను కాదని పేర్కొన్నారు. పర్యావరణ నిర్వాహకత్వం పట్ల కంపెనీ తిరుగులేని నిబద్ధతను పునరుద్ఘాటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement