ముంబై: ప్రభుత్వరంగ ఎన్‌టీపీసీ రెండవ త్రైమాసికంలో ఆకర్షణీయ లాభాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన క్యూ.2లో 5.5శాతం వృద్ధిని నమోదు చేసింది. రూ.3331 కోట్ల రూపాయల ఏకీకృత నికర లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.3156 కోట్లకు ఇది ఐదున్నరశాతం అధికం. క్యు1తో పోల్చితే ఏకీకృత నికరలాభంలో 10.4 శాతం క్షీణత నమోదైంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన స్వతంత్ర ఆదాయం క్యూ2లో రూ.41,015.14 కోట్లు. గతేడాది కంటే ఇది 39.17శాతం అధికం. మొత్తం ఖర్చులు రూ.37,517.74 కోట్లుగా ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement