మార్కెట్లోకి వచ్చిన మూడేళ్లలోనే అత్యంత వేగంగా పాపులారిటీ పొందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో నథింగ్ ఫోన్ ఒకటిగా నిలిచింది. ప్రత్యేకమైన డిజైన్, వినూతన్న మార్కెటింగ్ స్ట్రాటజీతో తక్కువ కాలంలోనే స్మార్ట్‌ఫోన్ లవర్స్ దృష్టిని ఆకర్షించింది నథింగ్ ఫోన్. కాగా, 2022 లో నథింగ్ బ్రాండ్ నుంచి తొలి ఫోన్, నథింగ్ ఫోన్-1 మార్కెట్లో లాంఛ్ అయింది. ఇక ఆ తర్వాత నథింగ్ ఫోన్ 2 కూడా 2023 జులైలో మార్కెట్లోకి వచ్చింది. వచ్చే ఏడాది విడుదల కానున్న నథింగ్ ఫోన్ 3 గురించి ఇప్పటినుంచే జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ ఫోన్ ఎలాంటి ఫీచర్లతో వస్తుంది, ధర ఎంత ఉండవచ్చు, ఎప్పుడు లాంఛ్ అవుతుంది వంటి వివారాలు సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి. నెక్స్ట్ జనరేషన్ నథింగ్ ఫోన్ సిరీస్ 2024 జులైలోనే విడుదల కానున్నట్లు సమాచారం. అయితే ఎలాంటి అప్‌గ్రేడ్స్‌తో ఈ ఫోన్ వస్తుందనే విషయంపై స్పష్టత లేనప్పటికీ.., కొన్ని ఫీచర్లు, ధరకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
నథింగ్ ఫోన్ 3 కూడా ఇంతకుముందు ఫోన్ల లాగానే ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో రానుంది. వెనుకవైపు గ్లిఫ్ ఇంటర్ఫేస్, ఎల్ఈడీ లైట్లు, నోటిఫికేష్ లైట్లతో ఈసారి డిజైన్ మరింత ఆకర్షణీయంగా ఉండేలా నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌ను నథింగ్ రూపొందిస్తున్నట్లు తెలుస్తొంది.
నథింగ్ ఫోన్ 3 ని అడ్వాన్స్ ఫీచర్లతో.. కెమెరా అప్గ్రేడ్లతో లాంఛ్ చేయనుంది కంపెనీ. అయితే ప్రాసెసర్ విషయంలో మాత్రం అడ్వాన్స్డ్ కాకుండా గతేడాది వచ్చిన స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 నే ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం స్నాప్డ్రగాన్ 8 ప్లస్ జెన్ 3 చిప్ సెట్‌ను అన్ని బ్రాండ్లు కొత్త ఫోన్లలో ఉపయోగిస్తున్నాయి.
నథింగ్ ఫోన్ 3 ధర..
నథింగ్ ఫోన్ 1 ప్రారంభ ధర భారత్ లో రూ.32,999 గా ఉంది. అయితే నథింగ్ ఫోన్ 2 కు వచ్చేసరిగా ధరను భారీగా పెంచింగి కంపెనీ. ఏకంగా రూ.44,999 చేసింది. డిజైన్, ప్రాసెసర్, కెమెరాను లేటెస్ట్ టెక్నాలజీతో తీసుకొచ్చినందుకే ధరను పెంచింది. దీంతో నథింగ్ ఫోన్ 3 ధర కూడా కాస్త పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ఒకవేళ తక్కువ ధరకే అందించాలనుకుంటే మాత్రం నథింగ్ ఫోన్ 2 స్థాయిలోనే నథింగ్ ఫోన్ 3ని కంపెనీ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.