Friday, November 22, 2024

HYD | పరిశ్రమలో మొదటి సహ-సృష్టించిన స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన నథింగ్

హైద‌రాబాద్ : నథింగ్ కమ్యూనిటీ ఎడిషన్ ప్రాజెక్ట్ అంతిమ ఫలితాలను విడుదల చేసింది. ద ఫోన్ (2) ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ నథింగ్ మొదటి సహ-సృష్టించిన ఉత్పత్తి. దీని అత్యంత ప్రతిభ కలిగిన కొంతమంది అనుచరులు నేరుగా నథింగ్ టీమ్ తో కలిసి పని చేసారు. హార్డ్ వేర్ నుండి వాల్ పేపర్స్ వరకు, ప్యాకేజింగ్ నుండి మార్కెటింగ్ వరకు, ఈ స్మార్ట్ ఫోన్ ను నథింగ్ కమ్యూనిటీ ఊహతో పూర్తిగా తీర్చిదిద్దబడింది. కంపెనీ, కమ్యూనిటీ మధ్య అడ్డంకిని నిర్మూలించాలని కోరుకునే ఒక కొత్త విధానానికి నథింగ్ మార్గదర్శకత్వం వహిస్తోంది.

ఈ ప్రాజెక్ట్ గణనీయమైన ప్రాధాన్యతని పొందింది. ప్రపంచవ్యాప్తంగా 47 దేశాల నుండి 900కి పైగా ఎంట్రీలు వచ్చాయి. కమ్యూనిటీ ఎడిషన్ ప్రాజెక్ట్ నథింగ్ మొదటి ప్రధానమైన పైలట్. ఇది హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, కంటెంట్ ను తన కమ్యూనిటీతో సహ-సృష్టిస్తుంది, వ్యాపారం భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకమైన చర్యను ముద్రించింది. విజతలు అస్ట్రిడ్ వాన్ హుసే అండ్ కెంటా అకాసకి, అండ్రెస్ మటియోస్, ఇయాన్ హెన్రీ సిమ్మండ్స్ అండ్ సోన్యా పల్మాలు గెలుపు భావనలను మరింత ఉత్తమంగా చేయడానికి లండన్ లో నథింగ్ డిజైన్ స్టూడియో, క్రియేటివ్, బ్రాండ్ అండ్ మార్కెటింగ్ టీమ్స్ తో సన్నిహితంగా సహకరించారు.

నథింగ్ టీమ్, కమ్యూనిటీల మధ్య ఈ సహకారం ఫలితంగా ఫోన్ (2ఏ) ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్, ప్రసిద్ధి చెందిన ఫోన్ (2ఏ) ప్లస్ చీకటి వెర్షన్ లో వెలుగుగా వ్యాఖ్యానించబడింది. ఇందులో దశ 1 – హార్డ్ వేర్ డిజైన్, దశ 2 – వాల్ పేపర్ డిజైన్, దశ 3 – ప్యాకేజింగ్ డిజైన్, దశ 4 – మార్కెటింగ్ కాంపైన్ లు ఉన్నాయి. నథింగ్ ఫోన్ (2ఏ) ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ ను 12 నవంబర్ న 12 / 256 జీబీ కోసం రూ. 29,999కి కొనుగోలు చేయడానికి కమ్యూనిటీ సభ్యులకు అవకాశం ఉంది. ఈ ఎడిషన్ ను కొనుగోలు చేసే వివరాలు నథింగ్ కమ్యూనిటీ ప్లాట్ ఫాంపై లభిస్తాయి. ఇక్కడ సభ్యులు పూర్తి సమాచారం కనుగొనవచ్చు. విలక్షణమైన కొనుగోలు లింక్ ను స్వీకరించడానికి రిజిస్టర్ చేయవచ్చు. అంతర్జాతీయంగా కేవలం 1,000 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయబడ్డాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement