Saturday, November 2, 2024

Nothing OS | నథింగ్‌కు సొంత ఓఎస్‌..

మొబైల్‌ మోడళ్లలో సంచలనం సృష్టించిన నథింగ్‌ కంపెనీ ఇప్పుడు మరొక ప్రయోగానికి సిద్ధమైంది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వ్యవస్థలో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆధిపత్యానికి చెక్‌ పెట్టేలా తనకు తాను సొంతంగా ఓఎస్‌ను రూపొందించుకుంటోంది. కంపెనీ వ్యవస్థాపకుడు, వన్‌ప్లస్‌ మాజీ సీఈవో కార్ల్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

టెక్‌క్రంచ్‌ సంస్థ నిర్వహించిన సదస్సులో దీనిపై కార్ల్‌ వివరణ ఇచ్చారు. కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ రూపొందించే అవకాశాల్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇందులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను కూడా జోడిస్తున్నట్లు తెలిపారు. సొంత ఓఎస్‌ ద్వారా మెరుగైన యూజర్‌ అనుభవాన్ని అందిస్తామని అన్నారు.

నిధుల కొరత ఉన్నప్పటికీ కంపెనీ దీనిపై పూర్తిస్థాయిలో పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుతం మొబైల్‌ మార్కెట్‌లో గూగుల్‌ ఆండ్రాయిడ్‌దే ఆధిపత్యం. చాలా వరకు స్మార్ట్‌ఫోన్లు ఇదే ఓఎస్‌ను వినియోగిస్తున్నాయి. యూపిల్‌ మాత్రం సొంతంగా ఓఎస్‌ను తయారు చేసుకుంది. హువాయే యాప్‌ గ్యాలరీ ద్వారా యాప్స్‌పను డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఇప్పుడు నధింగ్‌ కూడా ఇదే బాటలో పయనిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement