Friday, November 22, 2024

HYD | రిసాయా అకాడమీతో భాగస్వామ్యం చేసుకున్న నార్తర్న్ అరిజోనా యూనివర్సిటీ

హైదరాబాద్, (ఆంధ్ర‌ప్ర‌భ) : నార్తర్న్ అరిజోనా యూనివర్శిటీ (ఎన్ఏయు), రిసాయా అకాడమీతో భాగస్వామ్యం చేసుకుని, యుఎస్ఏలోని ఎన్ఏయు మహోన్నతమైన క్యాంపస్‌లో భారతీయ విద్యార్థులకు ఒక ప్రత్యేకమైన విద్యా అనుభవాన్ని అందిస్తూ, సమ్మర్ స్కూల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది.

ఈ భాగస్వామ్యంకు మల్లారెడ్డి విశ్వవిద్యాలయంతో ఉన్న అవగాహన ఒప్పందం మద్దతు అందిస్తుంది. మల్లారెడ్డి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ విఎస్ కే రెడ్డి ఈ కార్యక్రమం ప్రాముఖ్యతపై మాట్లాడుతూ… ఈ కార్యక్రమం త‌మ విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి, పరిశ్రమకు సిద్ధంగా ఉన్న నిపుణులుగా ఎదగడానికి ఒక గొప్ప అవకాశమ‌న్నారు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో తాము నాయకత్వం, ఆవిష్కరణలను పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు.

ఈ భాగస్వామ్యం విద్యా శ్రేష్ఠత, పరిశ్రమ సమలేఖనానికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుందన్నారు. ఎన్ఏయు వద్ద గ్లోబల్ అఫైర్స్ అసోసియేట్ వైస్ ప్రోవోస్ట్ సీజర్ ఫ్లోర్స్ మాట్లాడుతూ… భారతీయ విద్యార్థులకు ఈ అవకాశాన్ని అందించడానికి రిసాయా అకాడమీతో భాగస్వామ్యం చేసుకోవటం త‌మ‌కు చాలా ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమం అకడమిక్ ఎక్సలెన్స్‌ను ప్రోత్సహించడమే కాకుండా విద్యార్థులు, ఎన్ఏయు ప్రపంచ-స్థాయి అధ్యాపకులు, అత్యాధునిక వనరులతో వినియోగించుకోవటానికి అనుమతిస్తుందన్నారు.

రిసాయా అకాడమీ సీఈఓ రతీష్ బాబు మాట్లాడుతూ… ఈ భాగస్వామ్యం భారతీయ విద్యార్థులకు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి, గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌తో తమను తాము సమలేఖనం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఇస్తుందన్నారు. పరిశోధన, ఆవిష్కరణల్లో అగ్రగామిగా ఎన్ఏయు కీర్తి ఈ కార్యక్రమానికి సరైన భాగస్వామిగా చేస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement