Saturday, November 23, 2024

ఐటీ రిటర్నుల గడువు పెంపునకు నో.. మూడేళ్లలో ఇదే తొలిసారి

ఆదాయపన్ను చెల్లించే వ్యక్తులు, సంస్థలు రిటర్నులు దాఖలు చేయడానికి జులై 31వ తేదీతో గడువు ముగియనుండగా పొడిగించేందుకు కేంద్రప్రభుత్వం సుముఖంగా లేదు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటనలు కూడా చేసింది. గడువు పెంచకుండా ఉండటం గడచిన మూడేళ్లలో ఇదే తొలిసారి. జరీమానాలు పడకుండా ఉండాలంటే గడువులోగా పన్నుచెల్లింపుదారులు తమ ఐటీ రిట్నరులు దాఖలు చేయక తప్పదు. కోవిడ్‌ -19 మహమ్మారి కారణంగా గత రెండు ఆర్థిక సంవత్సరాలలో ఐటీ రిట్నరుల గడువును కేంద్రం పదేపదే పొడిగిస్తూ వచ్చింది.

కానీ ప్రస్తుతం కోవిడ్‌ ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో గడువు పొడించాల్సిన అవసరం, ఆలోచన ఏదీ లేదని రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ ఇప్పటికే ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో గడువు చివరిరోజున 50 లక్షల రిటర్నులు దాఖలైనాయని, ఈసారి జులై 31న కోటి ఐటీ రిటర్నలు దాఖలయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement