భారతదేశంలో 2021లో దాదాపు 160 మిలియన్ల మంది రుణ సేవలకు దూరంగా ఉన్నారని గ్లోబల్ ట్రాన్స్ యూనియన్ అధ్యయనం.. ఎంపవరింగ్ క్రెడిట్ ఇన్ క్లూజివ్ : ఏ డీపర్ క్రెడిట్ అండర్ సర్డ్వ్ అండ్ అన్సర్డ్వ్ కన్జ్యూమర్స్లో వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం.. క్రెడిట్ సేవలకు దూరంగా ఉన్న వ్యక్తుల్లో 5 శాతం మంది రెండేళ్ల వ్యవధిలో రుణాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం గమనించొచ్చు. సంపాదన విభాగంలో మొత్తం జనాభాలో సగానికి ప్రాతినిత్యం వహిస్తున్న దాదాపు 48 కోట్ల మంది 65 ఏళ్ల వయస్సు వరకు ఎలాంటి రుణం తీసుకోలేదు. సిబిల్ అధ్యయనంలో 16.4 కోట్ల మంది రుణం తీసుకున్నారు. రుణాలపై అవగహన కల్పించేందుకు లక్ష్యంగా ఈ అధ్యయనం కొనసాగింది. ఆర్థిక అవసరాలకు అనుగుణంగా.. తమ మొట్టమొదటి రుణ లేదా క్రెడిట్ కార్డును బ్యాంకులు లేదా క్రెడిట్ ఇన్స్టిట్యూట్ల నుంచి పొందుతున్నారు. ట్రాన్స్ యూనియన్ సిబిల్ ఎండీ అండ్ సీఈఓ రాజేశ్ కుమార్ మాట్లాడుతూ.. భారత్‌లో రిటైల్ క్రెడిట్ కార్డు మార్కెట్ వేగంగా మారుతున్నది. దీనికి ఎంతో వేగంగా మారుతున్న సాంకేతిక అంశాలు తోడు అవుతున్నాయి. దీంతో పాటు భారతదేశపు వైవిధ్యమైన జనాభా, ఈ మార్కెట్లో వృద్ధి, ఆర్థిక చేర్పు అవకాశాలను సైతం అందిస్తున్నాయి.
రెండేళ్ల పాటు అధ్యయనం..
భారతదేశ వ్యాప్తంగా వేగవంతమైన, సస్టెయినబుల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజివ్ కోసం ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసే లక్ష్యంతో అధ్యయనం ఉందని రాజేశ్ కుమార్ వివరించారు. రుణాలు తీసుకునేందుకు దూరంగా ఉన్నవారిలో ఎక్కువ మంది క్రెడిట్ కార్డుల వైపు అడుగులు వేస్తున్నారు. రుణాలకు దూరంగా ఉన్న వారి సెంటిమెంట్‌ను తెలుసుకునేందుకు అధ్యయనం కొనసాగింది. రుణ అవకాశాలను పొందలేని వినియోగదారులు కనీస రుణ పార్టిస్పేషన్ కలిగి ఉండటంతో పాటు ఒకే తరహా క్రెడిట్ ప్రొడక్ ్ట మాత్రమే పరిమితమై ఉంటారు. ఎంపిక చేసిన కొంతమంది కస్టమర్లను ఈ అధ్యయనంలో భాగస్వాములను చేశారు. సుదీర్ఘ కాలం పాటు రుణ సేవలకు దూరంగా ఉన్న వినియోగదారులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. రెండేళ్ల కాల వ్యవధిని.. కరోనా ముందు, తరువాత పరిస్థితులుగా విభజించారు. మార్చి 2018 నుంచి మార్చి 2020 వరకు, జూన్ 2019 నుంచి జూన్ 2021 వరకు సమయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. దీని ద్వారా మహమ్మారి కారణంగా ఎమైనా మార్పులు చోటు చేసుకున్నాయోమో తెలుసుకున్నారు. ట్రాన్స్‌యూనియన్ గ్లోబల్ స్టడీని.. భారత్‌తో పాటు కెనడా, కొలంబియా, హాంకాంగ్, దక్షిణాఫ్రికా, అమెరికాలో కూడా చేశారు. అన్ సర్డ్ ్వ, అండర్ సర్డ్ ్వ కస్టమర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
క్రెడిట్ స్కోర్ ఆధారంగానే రుణం..
భారత్‌లో.. క్రెడిట్ సర్డ్వ్ వినియోగదారుల పరంగా గణనీయమైన వృద్ధి కనిపించింది. 2017లో 91 మిలియన్లు ఉంటే.. 2021 నాటికి 179 మిలియన్లకు చేరింది. తద్వారా క్రెడిట్ సేవలు పొందిన వారి స్థాయి 12 నుంచి 22 శాతం పెరిగింది. క్రెడిట్ స్కోర్ లేకపోవడం కూడా రుణం పొందడానికి అవరోధంగా మారింది. క్రెడిట్ స్కోర్ లేని వారికి రుణం ఇచ్చేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. రుణం తీసుకోని వారు ఎలా ఆర్థికంగా ముందుకు వెళ్తున్నారనే విషయాన్ని తెలుసుకోవడం కోసం అధ్యయనం చేశారు. కొలంబియా, దక్షిణాఫ్రికా లాంటి ఇతర మార్కెట్స్‌లో కూడా అధ్యయనం చేయడంతో పాటు రుణాలకు దూరంగా ఉండి తొలుత రుణాలను వినియోగించుకుంటున్న వారి గురించి తెలుసుకునే ప్రయత్నం జరిగింది. వీరు పొందుతున్న రుణాల్లో మైక్రో క్రెడిట్ (37శాతం), క్లాతింగ్ రుణాలు (59శాతం) ఉన్నాయి. 27 శాతం మంది అండర్ సర్డ్వ్ వినియోగదారులు తాము తగినంతగా క్రెడిట్ పొందలేకపోతున్నామంటున్నారు. ఇది అన్ సర్డ్ ్వ విభాగంలో 58శాతంగా ఉంది. 38 శాతం అండర్ సర్డ్వ్ వినియోగదారులు 65 శాతం అన్ సర్డ్వ్ వినియోగదారులు ప్రస్తుత రుణ లభ్యతపరంగా తాము సంతృప్తిగా లేమని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..