Saturday, November 23, 2024

సీబీడీటీ చైర్మన్‌ గా నితిన్‌ గుప్తా..

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్‌గా సీనియర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారిణి నితిన్‌ గుప్తా నియమితులయ్యారు. 1986 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి, ప్రస్తుతం ఆమె బోర్డులో ఇన్వెస్టిగేషన్‌ అధికారిగా పని చేస్తున్నారు. వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌తో ఆమె రిటైర్‌ కానున్నారు.

క్యాబినెట్‌ అపాయింట్స్‌ కమిటీ ఆమెను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్‌ గా నియమించాలని నిర్ణయించిందని జూన్‌ 25న వెలువడిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సింగీతా సింగ్‌ తాత్కాలిక చైర్మన్‌ గా భాద్యతలు చూస్తున్నారు. ఐదుగురు సభ్యులున్న బోర్డులో ప్రస్తుతం 1985 బ్యాచ్‌కు చెందిన అనూజా సారంగీ సీనియర్‌ అధికారిగా ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement