ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ అప్‌డేట్ చేసిన నిస్సాన్ మాగ్నైట్ మోడల్‌ను ఇండియన్ మార్కెట్‌లో విడుదల చేసింది. కొత్త మాగ్నైట్ ప్రారంభ ధర 5.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ ప్రకటించింది. అయితే తొలి 10 వేల మంది కస్టమర్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందని, తరువాత ధరలను సవరిస్తామని తెలిపింది.
కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఆరు వేరియంట్లలో లభిస్తుంది. టాప్ వేరియంట్ ధర 11.50 లక్షల రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. కొత్త మాగ్నైట్‌లో ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో మార్పులు చేశారు. ఇది ఆరు స్పీడ్ మాన్యువల్, సీ వీటీ ఆప్షన్లలో లభిస్తుంది.