Tuesday, November 26, 2024

భారత్‌ మార్కెట్‌లోకి నిస్సాన్‌ గ్లోబల్‌ కార్లు

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ నిస్సాన్‌ మన దేశంలో తమ కార్ల పోర్ట్‌ఫోలియోను విస్తరించనుంది. నిస్సాన్‌ కంపెనీ తన అంతర్జాతీయ స్థాయి ఎస్‌యూవీలను మన మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఇందు కోసం ఆయా మోడళ్లను మన దేశ రోడ్లపై ఎలాంటి పనితీరును కనబరుస్తాయో తెలుసుకునేందుకు పరీక్షిస్తోంది. నిస్సాన్‌ ఎక్స్‌ ట్రెయిల్‌, జ్యూక్‌, ఖష్కాయ్‌ వంటి మోడల్‌ కార్లను మన మార్కెట్‌లో లాంచ్‌ చేయాలని ప్రయత్నిస్తోంది. నిస్సాన్‌ కంపెనీ మన దేశంలో ప్రస్తుతం మాగ్న్రైట్‌, కిక్స్‌ మోడల్‌ కార్లను విక్రయిస్తోంది.

వివిధ ప్రాంతాలు, రోడ్లపై ఆయా మోడళ్లు వినియోగదారుల అభిరుచులు, అంచనాలకు అనుగుణంగా నడుస్తున్నాయా లేదా పరీక్షిస్తున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. ఒకసారి టెస్టింగ్‌ పూర్తయిన తరువాత ఎక్స్‌ ట్రెయిల్‌ను తొలు మార్కెట్‌లో తీసుకు రావాలని కంపెనీ నిర్ణయించింది. దశల వారిగా ఇతర మోడల్‌ కార్లును కూడా ఇండియన్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం మన దేశ కార్ల మార్కెట్‌లో నిస్సాన్‌ వాటా 10 శాతం మాత్రమే ఉంది. దీన్ని మరింత పెంచుకునేందుకు కొత్త మోడళ్లను తీసుకు రావాలని నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement