దేశీయ కంపెనీలు తయరీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కోరారు. ఈ విషయంలో దేశీయ కంపెనీలకు ఉన్న అడ్డంకులు ఏంటనీ ఆమె ప్రశ్నించారు. విదేశీ కంపెనీలు సైతం దేశంపై నమ్మకంతో పెట్టుబుడు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ఆమె చెప్పారు. ప్రభుత్వం పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించడానికి రెడీగా ఉందన్నారు. దేశీయ కంపెనీలను హన్మాన్తో పోల్చిన ఆమె ఈ అవకాశాన్ని వదులుకోవద్దని కోరారు. మంగళవారం నాడు జరిగిన 15వ మైండ్మైన్ సదస్సులో ఆమె ప్రసంగించారు.
తాను 2019లో బాద్యతలు తీసుకున్న నాటి నుంచి పెట్టుబడులకు దేశీయ వాతావారణం అనుకూలంగా లేదనే వాదన ఉందని నిర్మలాసీతారామన్ చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కార్పొరేట్ పన్నులు తగ్గించామని, ప్రయివేట్ రంగానికి మద్దతు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నప్పటికీ పరిశ్రమ వర్గాలను సమర్ధిస్తు వస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం వైపు నుంచి ఇంత చేస్తున్నా, పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అడ్డంకి ఎంటనీ ఆమె ప్రశ్నించారు. దీనికి దేశీయ కంపెనీలే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
మన దేశంలో వివిధ దేశాలు, కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ఇదే సరైన సమయమని చెప్పారు. ఎఫ్పీఐ, ఎఫ్డీఐలు కూడా భారీ ఎత్తున వస్తున్నాయని చెప్పారు. స్టాక్ మార్కెట్ సూచీలు బలంగా ముందుకు సాగుతున్నాయని ఆర్ధిక మంత్రి చెప్పారు. అంజనేయుడిలా దేశీయ కంపెనీలు తమ సామర్ధ్యాన్ని విశ్వసించలేకపోతున్నాయా అని ప్రశ్నించారు. మన దేశంలో అనువైన వాతావరణ ఉన్నందునే చైనా నుంచి తరలిపోతున్న కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయల్లో లావాదేవీలు జరిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేసిన విషయాన్ని ఆర్థిక మంత్రి గుర్తు చేశారు. దీని వల్ల అనేక దేశాలు ద్వైపాక్షిక వాణిజాన్ని రూపాయల్లో చేసేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు.