Saturday, November 23, 2024

90’s కిడ్స్ కి బాగా తెలుసు..ఇప్పుడు దీని విలువ ఎంతంటే..?

వీడియో గేమ్ లు ఆడే కుర్రకారుకి కన్సోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే మొబైల్ లో గేమ్స్ ఆడుతున్నారు కాని… ఓ పాతికేళ్ల క్రితం వీడియో గేమ్ అంటే కన్సోల్ తో ఆడటమే.. దాని ప్రత్యేకతే వేరు. అయితే ఇప్పుడు ఈ కన్సోల్ ను వేలం వేయగా రూ.11.6 కోట్లకు సొంత చేసుకున్నారు ఓ అజ్ఞాతవ్యక్తి. వీడియో గేమ్ లు, వాటిని ఆడే కన్సోల్స్ తయారీలో నింటెండో సంస్థ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. నింటెండో ఓ జపాన్ కంపెనీ. 1977లో ఈ సంస్థ నుంచి తొలి వీడియో గేమ్ విడుదల కాగా, 80వ దశకం తర్వాత ఈ సంస్థ మార్కెట్ ను శాసించే స్థితికి చేరింది. సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల ఎలక్ట్రానిక్ మార్కెట్లలోనూ ఎక్కడ చూసినా నింటెండో వీడియో గేములు, గేమింగ్ కన్సోల్స్ కనిపించేవంటే అతిశయోక్తి కాదు.

ఈ సంస్థ 1996లో తయారుచేసిన ఓ వీడియో గేమ్ కన్సోల్ ను ఇటీవల వేలం వేశారు. ఓ అజ్ఞాతవ్యక్తి ఆ నింటెండో సూపర్ మారియో-64 గేమింగ్ కన్సోల్ ను రూ.11.6 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం. అమెరికాలోని టెక్సాస్ హెరిటేజ్ వేలం సంస్థ ఈ వేలం నిర్వహించింది. నింటెండో సంస్థ తయారుచేసిన సూపర్ మారియో-64 గేమింగ్ కన్సోల్ అప్పట్లో అమ్మకాల దుమ్ము దులిపింది. ప్రపంచవ్యాప్తంగా 33 మిలియన్ యూనిట్లు అమ్ముడయ్యాయి. నింటెండో సంస్థకు బాగా పేరుతెచ్చిపెట్టిన వీడియో గేమింగ్ కన్సోల్స్ లో సూపర్ మారియో-64 ప్రముఖమైనది.

ఇది కూడా చదవండి: హుజూరాబాద్‌లోనూ దుబ్బాక సీన్ రిపీట్: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

Advertisement

తాజా వార్తలు

Advertisement