Saturday, November 23, 2024

ఈవీ బ్యాటరీలకు కొత్త టెక్నాలజీ..

భవిష్యత్‌ కాలమంతా ఈవీలదే.. అయితే, ఈవీలకు అవసరమైన బ్యాటరీల విషయంలో ఇప్పటికీ కొన్ని సమస్యలున్నాయి. ఈ బ్యాటరీలు నూరుశాతం సురక్షితమని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఇంధన నిల్వ సామర్థ్యాన్ని పెంచుతూనే, మంటలు చెలరేగకుండా ఉండేలా కొత్తతరం ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం టెక్నాలజీని అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. నేచర్‌ జర్నల్‌లో ప్రచురించబడిన తాజా అధ్యయనం ప్రకారం, కొత్త టెక్నాలజీ లిథియం డెండ్రైట్‌ల పెరుగుదలను అణచివేస్తుంది.

- Advertisement -

మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన చున్‌షెంగ్‌ వాంగ్‌ నేతృత్వంలోని బ్యాటరీ ఇంటర్‌ లేయర్‌ కోసం ఈ కొత్త డిజైన్‌ డెండ్రైట్‌లు ఏర్పడకుండా చేస్తుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఆచరణీయమైన ఘన-స్థితి బ్యాటరీల ఉత్పత్తిని అనుమతిస్తుంది. ఆల్‌ సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలు ప్రస్తుత విద్యుత్‌ లేదా అంతర్గత దహన నమూనాల కంటే సురక్షితమైన కార్ల తయారీకి దోహదం చేస్తుందని వాంగ్‌ చెప్పారు. 2026 నాటికి కొత్త బ్యాటరీలను మార్కెట్‌లోకి తీసుకురావాలనే లక్ష్యంతో, సాలిడ్‌ పవర్‌ కొత్త టెక్నాలజీలని వాణిజ్యీకరించే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ట్రయల్స్‌ ప్రారంభించాలని యోచిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement