ప్రముఖ పుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సరికొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. జంతుప్రియుల కోసం కొత్తగా స్విగ్గీ పోలీస్ పేరుతో ఈ సర్వీస్‌ను తీసుకు వచ్చింది. తప్పిపోయిన పెట్స్‌ను వెతికి తచ్చేందుకు ఈ సేవలను పరిచయం చేస్తున్నట్లు తెలిపింది. ఈ సేవ ద్వారా తప్పిపోయిన జంతువులకు సంబంధించి వివరాలు, ఫోటోలతో యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. సంస్థకు చెందిన డెలివరీ భాగస్వాములు తప్పిపోయిన జంతువులను గుర్తించి వాటి వివరాలను, లొకేషన్‌ను స్విగ్గి టీమ్‌కు తెలియచేస్తారు.
వెంటనే అప్డేట్ను పెట్ ఒనర్లకు తెలుపుతారు. స్విగ్గీ డెలివరి పార్ట్నర్ సాయంతో పెట్‌ను కనిపెడతారు. ఏప్రిల్ 11న జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం సందర్భంగా ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. టాటా ట్రస్ట్ జనరల్ మేనేజర్ శంతను నాయుడు, హౌస్ ఆఫ్ ఛైర్మన్ సమక్షంలో ఈ సేవలను పరిచయం చేసింది. 3.5 లక్షల మంది డెలివరీ భాగస్వాములు ఈ సేవలను అందించడంలో సాయపడతారని స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్ తెలిపారు.