Friday, November 22, 2024

Whatsapp | వాట్సాప్‌లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే !

వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ వచ్చేసింది. లాక్ స్క్రీన్ నుంచి స్పామ్ కాంటాక్టులను నేరుగా బ్లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం..

స్కామర్లు మోసాలకు పాల్పడే ప్రాథమిక ప్లాట్‌ఫారమ్‌లలో వాట్సాప్ ఒకటి. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వస్తుంటాయి. ప్రైవసీ ఫీచర్లు ఎన్ని అందుబాటులో ఉన్నప్పటికీ వినియోగదారులు ఇప్పటికీ స్కామర్ల మోసాలకు బలైపోతూనే ఉన్నారు. ఈ సమస్యను గుర్తించి వాట్సాప్ అదనపు ప్రొటెక్షన్ లేయర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ కొత్త ప్రైవసీ & సెక్యూరిటీ ఫీచర్‌‌తో.. లాక్ చేసిన స్క్రీన్‌లో నోటిఫికేషన్‌లోనే స్పామ్ లేదా అనుమానాస్పద కాంటాక్టులను నేరుగా బ్లాక్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది వాట్సాప్‌. అయితే, ఈ ఫీచర్ పని చేయాలంటే.. లాక్ స్క్రీన్‌లో నోటిఫికేషన్ కనిపించేలా మీ ఫోన్‌ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే వాట్సాప్ ఓపెన్ చేయకుండా లాక్ స్క్రీన్ నుంచి నేరుగా కాంటాక్టులను సులభంగా బ్లాక్ చేయగలరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement