Sunday, November 24, 2024

New Rules – బ్యాంకింగ్‌లో నేటి నుంచి కొత్త రూల్స్‌

ఆర్బీఐ డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫ‌ర్ రూల్‌
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై ఫైనాన్స్ చార్జెస్‌
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, రివార్స్‌లో మార్పులు
ఇండియ‌న్ బ్యాంక్ ఎస్టీ స్కీమ్ గ‌డువు పెంపు
రైల్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్‌లోనూ చేంజెస్‌
నేటి నుంచి అమ‌ల్లోకి రానున్న మార్పులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, బిజినెస్ డెస్క్‌: నవంబర్‌ నెల ప్రారంభం అయ్యింది. ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో కూడా బ్యాంకింగ్‌.. ట్రెయిన్‌, క్రెడిట్ కార్డుకు సంబంధించిన‌ పలు నిబంధనలు మారాయి. బ్యాకింగ్, ఫైనాన్షియల్, ఇతర రంగాలకు సంబంధించిన పలు నియమ, నిబంధనల్లో వ‌చ్చిన మార్పులేమిటో చ‌దివి తెలుసుకుందాం.. కాగా, ఈ నిబంధనలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సామాన్యుడిపై ఈ నిబంధనలు చాలా పెద్ద ప్రభావం చూపుతాయి. మారిన నిబంధనలు, మార్పులు ఏంటో ప‌రిశీలిద్దాం..

1) ఆర్బీఐ డొమెస్టిక్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ రూల్‌ అమలు

- Advertisement -

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. డొమెస్టిక్‌ మనీ ట్రాన్స్‌ఫర్ కోసం కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. ఇది నేటి (న‌వంబ‌ర్ 1వ తేదీ) నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంకింగ్ చానెల్‌లను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఆర్బీఐ ఈ రూల్‌ను తీసుకొచ్చింది.

2) రైలు టికెట్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌

ఇప్పటి వరకు రైలు టికెట్లను 120 రోజుల ముందుగానే బుక్ చేసుకునే ఫెసిలిటీ ఉండేది. అయితే.. ఈ ఫెసిలిటీని రైల్వే శాఖ 60 రోజులకు తగ్గించాలని నిర్ణయించింది. దీంతో రైలు ప్రయాణానికి 60 రోజుల ముందు మాత్రమే టికెట్ బుకింగ్ చేయవచ్చు. ఈ కండిష‌న్‌తో ప్రయాణికులు తగిన సమయానికి జ‌ర్నీ ప్లాన్‌ చేసుకునేలా ఉండ‌నుంది.

3) ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఫైనాన్స్ చార్జీలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై ఫైనాన్స్ చార్జీలను పెంచింది. ఇప్పటి వరకు 3.5శాతం ఉండే ఈ చార్జీలను నవంబర్ 1వ తేదీ నుంచి 3.75శాతానికి పెంచింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై బకాయిలున్న వినియోగదారులు ఇప్పుడు మరింత ఎక్కువ వడ్డీ చెల్లించవలసి ఉంటుంది.

4) ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఫీజు, క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్స్ విధానంలో కూడా మార్పులు జరిగాయి. నవంబర్ 15వ తేదీ నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. కొత్త మార్పులను వినియోగదారులు బాగా అర్థం చేసుకుని తమ ఖర్చులను సవ్యంగా నిర్వహించుకోవడం చాలా ముఖ్యం.

5) ఇండియన్ బ్యాంక్ ఎఫ్డీ స్కీమ్ గడువు పెంపు

ఇండియన్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ స్కీమ్‌ల గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. దీనివల్ల వినియోగదారులు తమ డిపాజిట్‌లపై మరింత సమయం పాటు అధిక వడ్డీ రేట్లను పొందే చాన్స్‌ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement