మొబైల్ ఫోన్ సిమ్ కార్డ్ నంబర్‌ను మార్చకుండానే మరొక నెట్‌వర్క్‌కు మారే అవకాశం ఉంది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ఇందుకు అవకాశం కల్పిస్తుంది. అయితే టెలికాం నియంత్రణ సంస్థ TRAI ఈ ఫోన్ నంబర్ పోర్టబిలిటీకి సంబంధించి కొత్త నిబంధనను తీసుకొచ్చింది.
సిమ్ కార్డ్ స్వాప్ లేదా రీప్లేస్‌మెంట్ తర్వాత మరో నెట్‌వర్క్‌కు మారడానికి 7 రోజుల పాటు నిలిపివేయనున్నట్టు పేర్కొంది. సిమ్ స్వాప్ మోసాలను అరికట్టేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఈ కొత్త నిబంధనలు జులై 1 నుంచి అమలోకి వస్తాయని ట్రాయ్ తెలిపింది.