Saturday, December 28, 2024

విమాన బ్యాగేజ్‌కి కొత్త రూల్స్ !

దేశీయ లేదా అంతర్జాతీయ విమానంతో నిమిత్తం లేకుండా ప్రయాణికుడు తన వెంట కేవలం ఒక హ్యాండ్‌ బ్యాగేజీని మాత్రమే విమానంలోకి తీసుకెళ్లే నిబంధన అమల్లోకి వస్తోంది. ఎకానమీ లేదా ప్రీమియం ఎకానమీ తరగతిలో ప్రయాణించే ప్రయాణికులు తమ వెంట విమానంలోకి 7 కిలోల వరకు బరువున్న ఒక బ్యాగేజీని మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుందని ఎయిర్‌ ఇండియా ప్రకటించింది.

అయితే ఫస్ట్‌ లేదా బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించే ప్రయాణికులు మాత్రం సుమారు 10 కిలోల వరకు బరువుండే ఒకే ఒక హ్యాండ్‌ బ్యాగేజీని తీసుకెళ్లవచచ్చని తెలిపింది. బ్యాగేజీ కొలతలను కూడా ఎయిర్‌ ఇండియా స్పష్టం చేసింది. బ్యాగేజీ ఎత్తు 55 సెంటీమీటర్లు, పొడవు 40 సెంటీమీటర్లు, వెడల్పు 20 సెంటీమీటర్లు మించరాదని తెలిపింది.

ఒక్కో ప్రయాణికుడి హ్యాండ్‌ బ్యాగేజీ చుట్టుకొలత 115 సెంటీమీటర్లు మించరాదని కూడా తెలిపింది. ఒకవేళ ప్రయాణికుడి హ్యాండ్‌ బ్యాగేజీ బరువు, విస్తీర్ణం పరిమితిని మించి ఉన్న పక్షంలో అదనపు చార్జీలు భరించక తప్పదని ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. అయితే 2024 మే 2కి ముందు తమ టికెట్లను బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు మాత్రం వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొంది.

ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులు 8 కిలోల వరకు, ప్రీమియం ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులు 10 కిలోల వరకు, ఫస్ట్‌ లేక బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణికులు 12 కిలోల వరకు బరువుండే హ్యాండ్‌ బ్యాగేజీని తీసుకెళ్లవచ్చని ఎయిర్‌ ఇండియా పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement