Tuesday, November 26, 2024

సరికొత్తగా రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్..

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా సాంగ్ ఎంతలా ఫేమస్ అయిందే అందరికి తెలిసిందే..ఆ సాంగ్ హిట్ అవడంలో రాయల్ ఎన్ ఫీల్డ్ బండి కూడా తగిన పాత్ర పోషించిందని చెప్పాలి. కుర్రకారుకు బెల్లెట్ డుగు డుగు సౌండ్ వినిపిస్తే చాలు బుల్లేట్ బండి కోసం ఎగబడుతారు. పేరుకు తగ్గట్టుగానే రాజసం ఉట్టిపడేలా ఉంటుంది బుల్లేట్ బండి అలియాస్ రాయల్ ఎన్ ఫీల్డ్.. కొన్ని దశాబ్దాలుగా ఆ సంస్థ ద్విచక్రవాహనాలను రూపొందిస్తూ మార్కెట్లో హవా కొనసాగిస్తోంది. బుల్లెట్ మోడల్ తో అన్ని వర్గాల మనసులను దోచుకున్న రాయల్ ఎన్ ఫీల్డ్ కు మరో మోడల్ అత్యంత లాభసాటిగా నిలుస్తోంది. అది క్లాసిక్ మోడల్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తాజాగా సరికొత్త హంగులతో క్లాసిక్ 350 మోడల్ ను రాయల్ ఎన్ ఫీల్డ్ భారత్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. 11 రంగుల్లో ఈ బైక్ లభిస్తుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.1.84 లక్షలు కాగా, హై ఎండ్ మోడల్ ధరను రూ.2.15 లక్షలుగా నిర్ణయించారు. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. దీంట్లో అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లు పొందుపరిచారు. కన్సోల్ విషయానికొస్తే డిజిటల్-అనలాగ్ మీటర్ తో సరికొత్తగా కనిపించనుంది. దీనికి ఐదు గేర్లు ఉంటాయి. 349 సీసీ ఇంజిన్ తో 20.2 బీహెచ్ పీ శక్తిని అందిస్తుంది.

ఇది కూడా చదవండి: నేలమట్టం కాబోతున్న ట్విన్ టవర్స్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement